ఎక్కడో ఉన్న చైనా.. తైవాన్ మధ్య లొల్లి జరిగితే మనకెందుకు చెప్పండి? సంబంధం లేని విషయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? మన చుట్టూ ఉన్న వాటి గురించి పట్టించుకోం కానీ.. చైనా - తైవాన్ మధ్య కోట్లాట మనకు అవసరం ఏమిటి? చెప్పండి? లాంటి మాటలు మీ మనసులోకి వస్తే మీరు తప్పు చేస్తున్నట్లే. మీకు ఏ మాత్రం అవగాహన లేనట్లే. చైనా - తైవాన్ మధ్య లొల్లి మీకు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ విషయంలో మీకున్న ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయాల్సిన అవసరం చాలా ఉంది.
ఎందుకంటే.. ఆధునిక కాలంలో ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు వేరు. చైనా - తైవాన్ మధ్య యుద్ధమే జరిగితే దానికి యావత్ ప్రపంచం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో జరిగిన యుద్ధాలు ఒక బలమైన.. శక్తివంతమైన దేశం.. మరో బలహీనమైన దేశం మీద దాడి చేయటం. కానీ.. చైనా - తైవాన్ ఎపిసోడ్ అలాంటిది కాదు. చైనా ఎంతటి ఆర్థికంగా శక్తివంతమైన దేశమో.. దానికి మించిన శక్తివంతమైనది తైవాన్. కాకుంటే చైనా విశాలమైనది.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం.. ఆ లెక్కన చూస్తే తైవాన్ చాలా బుజ్జి దేశం. నైసర్గికంగా చూసినా.. జనాభా పరంగా చూసినా తైవాన్ చిన్నదేశమే కానీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలమైన దేశాల్లో అదొకటన్నది మర్చిపోకూడదు.
ప్రపంచానికి అవసరమైన సెమీ కండక్టర్లు.. చిప్ లకు కేరాఫ్ అడ్రస్ తైవాన్. సంబంధం లేని రష్యా - ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా ప్రపంచం మీద పడిన పెట్రో భారం ఎంతో తెలిసిందే. ఇక.. చైనా.. తైవాన్ మధ్య యుద్దం మొదలైతే ప్రపంచానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ రెండు దేశాల మధ్యనున్న సముద్ర మార్గం.. ప్రపంచంలో అత్యంత రద్దీ గా ఉండే మార్గాల్లో ఒకటిగా చెప్పొచ్చు. యుద్ధం మొదలైతే.. వాణిజ్య నౌకల ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారుతుంది. అదే జరిగితే.. ప్రపంచ వాణిజ్యం మీద ప్రభావం పడుతుంది.
ఇక.. యుద్దమే జరిగితే.. తైవాన్ మీద జరిగే దాడితో సెమీ కండ్టకర్లు.. చిప్ ల తయారీ మీద ప్రభావం పడటం ఖాయం. అదే జరిగితే.. వాడే మొబైల్ ఫోన్లు.. కంప్యూటర్లు.. ట్యాబ్ లు...టీవీలు.. ఎలక్ట్ట్రికల్ వస్తువులు మాత్రమే కాదు.. కార్లు లాంటి వాటి తయారీ మీదా ప్రభావం పడుతుంది. మొత్తంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీద అమితంగా ప్రభావం చూపుతుంది. ఇవన్నీ చూసినప్పుడు చైనా - తైవాన్ మధ్య చోటు చేసుకునే ఉద్రిక్తతలు మన అందరి మీదా తప్పనిసరిగా ప్రభావాన్ని చూపటమే కాదు.. మన ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయటం ఖాయం.
తాజాగా తైవాన్ కు చైనా చేసిన హెచ్చరికల్ని చూస్తే.. ‘వేర్పాటు వాదాన్ని అస్సలు సహించం. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవటానికి బలప్రయోగం చేయటానికి కూడద వెనుకాడం. ప్రశాంతంగా విలీనం కావటానికి అవసరమైన అవకాశాల్ని కల్పిస్తాం. అదే సమయంలో ఏ విధమైన వేర్పాటు వాదానికి చోటు లేదునప బలప్రయోగ అవకాశాల్ని తోసిపుచ్చటం లేదు. విలీనానికి అవసరమైన ఏ చర్య తీసుకోవటానికైనా ఆప్షన్ సిద్దంగా పెట్టుకున్నాం’’ అంటూ శ్వేత పత్రాన్ని విడుదల చేసిందా.
దాదాపు 22 ఏళ్ల తర్వాత భారీ సైనిక విన్యాసాల మధ్య మరోసారి శ్వేత పత్రాన్ని విడుదల చేయటం చూస్తే.. రానున్న రోజులు మరింత గడ్డుగా ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు. సో.. తైవాన్ విషయంలో చైనా నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ప్రపంచ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? అన్న విషయంపై అవగాహన కలుగుతుంది.