పది అణ్వస్త్రాలతో డ్రాగన్ టెస్టింగ్

Update: 2017-02-02 13:27 GMT
భారత్ కు పక్కలో బల్లెమైన డ్రాగన్ తాజాగా తనకున్న బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పేప్రయత్నం చేసింది. అన్నింటికి మించి.. తలపొగరు అమెరికా అధ్యక్షుడిగా పేరొందిన ట్రంప్ కు చిన్నపాటి షాక్ ఇవ్వటంతో పాటు.. తేడా వస్తే తానేమిటన్న విషయాన్ని చెప్పేలా వ్యవహరించింది. అణ్వస్త్రాల పరంగా మంచి సౌండ్ అయిన చైనా.. ఒకేసారి పది అణ్వస్త్రాల్ని ఉపయోగించే సత్తా తన సొంతమన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది.

ట్రంప్ అధ్యక్షుడిగా మారిన తర్వాత చైనా.. అమెరికాకు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న వేళ.. ఒక క్షిపణికి పది అణ్వస్త్రాల్ని అమర్చి పరీక్షలు జరిపినట్లుగా చెబుతున్నారు. ట్రంప్ కు తన సైనిక శక్తిని తెలియజేసేందుకే ఇలాంటి పని చేసి ఉంటుదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.  ఒకేసారి పది న్యూక్లియర్ వార్ హెడ్స్ ను ఉపయోగించి పరీక్ష జరపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

గత నెలలో ఈ పరీక్షలు నిర్వహించారని.. గుట్టుగా జరిపిన ఆ ఆయుధ పరీక్ష సమాచారం ప్రస్తుతం బయటకు పొక్కింది. తాజాగా పరీక్షలు జరిపిన క్షిపణి.. ఒకేసారి పది రకాల వాహనాల్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే సత్తా ఉందని చెబుతున్నారు. గతంలోనే పరీక్షలు జరిపిన డాంగ్ ఫెంగ్ 5కి ఇది అప్ డేటెడ్ వెర్షన్ గా చెబుతున్నారు. చైనా తాజా వైఖరి ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News