ఎవరెస్ట్‌ కిందనుండి ఎగిరొస్తారట!

Update: 2015-04-10 18:56 GMT
భారత్‌ లో చైనా అనాఫిషియల్‌ మార్కెట్‌ విచ్చలవిడిగా సాగుతుందంటే అతిశయోక్తి కాదేమో? భారత్‌ - చైనా సరిహత్తుల్లో కూడా చైనా చేసే విచిత్ర వేషాలు కూడా కోకొల్లలు. ఇకపై అనాఫిషియల్‌ మార్కెట్‌ కంటే అఫీషియల్‌ గా ఒక మార్గం వేసేసుకుంటే బెటర్‌ అనుకున్నారో ఏమో తెలియదు కానీ... చైనా టు భారత్‌ వయా నేపాల్‌ రైలు మార్గం ఏర్పాటు చేసేస్తుంది చైనా! ఈ క్రమంలో ఎవరెస్ట్‌ పర్వతం కింది నుంచి నేపాల్‌ - చైనా దేశాల మధ్య సొరంగ రైలు మార్గం ఏర్పాటు చేయాలనే అంశం పరిశీలనలో ఉందని చైనా మీడియా వెల్లడిరచింది. అయితే దీన్ని భారత్‌ తో సంబందాల కోసం కాదు.. ఏదో నేపాల్‌ వాళ్లు అడుగుతున్నారు కాబట్టి అనే బిల్డప్‌ ఇస్తు... తమ అంతర్జాతీయ సరిహద్దు సొరంగ మార్గాన్ని పెంచనుంది చైనా! అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020 నాటికి ఈ రైలు మార్గాన్ని పూర్తిచేసేస్తారట! అయితే ఈ విషయంలో ఇప్పటికే చైనా - నేపాల్‌ మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా భారత్‌ - చైనా ల మధ్య వ్యాపార వారధిగా నేపాల్‌ రాజధాని ఖాట్మాండు వరకూ తొలివిడత పనులు పూర్తి చేసి... అనంతరం ఎవరెస్ట్‌ కింద సొరంగ మార్గాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఇప్పటికే నేపాల్‌ అధికారులు ప్రకటించేశారు.

ఈ సొరంగ మార్గాన్ని తవ్వే ప్రక్రియను టిబెటన్‌లో నికోమోలాంగ్మాు అని వ్యవహరిస్తారు. ఈ లైన్‌ ద్వారా వెళ్ళే రైళ్ళ వేగాన్ని గంటకు 120 కిలోమీటర్లకు పరిమితం చేయనున్నారు. చైనా... భారతీయ మార్కెట్లకు చేరువ కావాలంటే నేపాల్‌కు దగ్గరి దారి కనుక్కోవడమొక్కటే మార్గమని గుర్తించిన చైనా ఆ దిశగా అడుగులు వేస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే... భారత్‌ - చైనాల మధ్య ప్రధానంగా వ్యవసాయోత్పత్తులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని చైనా అధికారులు అంటున్నారు. ఇదే క్రమంలో ఇరిదేశాలు పర్యాటకంగా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చనేది వారి ఆలోచనగా ఉంది! అయితే ... హిమాలయాల ప్రాంతంలో రైలుమార్గం నిర్మాణం చేపట్టడం వల్ల వల్ల అంతర్గత భద్రత తోపాటు, పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News