భార‌త్‌..మీపై సైనిక చ‌ర్య‌ త‌ప్ప‌దు

Update: 2017-07-04 14:54 GMT
మ‌న దేశానికి చైనా తాజాగా మ‌రో వార్నింగ్ ఇచ్చింది. సిక్కిం ప్రాంత స‌రిహ‌ద్దులో భార‌త బ‌ల‌గాలు త‌మ భూభాగంలోకి వ‌చ్చాయంటూ కొన్నాళ్లుగా చైనా ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకుంటే మంచిది.. లేదంటే మిలిట‌రీని రంగంలోకి దింప‌క త‌ప్ప‌దు అని చైనీస్ అధికార మీడియా హెచ్చ‌రించింది. ఈ అంశాన్ని స‌రిగా డీల్ చేయ‌క‌పోతే.. ఇండియా - చైనా మ‌ధ్య యుద్ధం త‌ప్పదు అని అక్క‌డి మీడియా, ఆ దేశానికి చెందిన నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ లో రీసెర్చ్‌ స్కాలర్‌ గా పని చేస్తున్న హు జియాంగ్ అనే వ్య‌క్తి తాజాగా హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ``మొద‌ట శాంతియుతంగా స‌మ‌స్య ప‌రిష్కారానికి చైనా కృషి చేయాలి. అయినా ఇండియా మాట విన‌క‌పోతే బ‌ల ప్ర‌యోగం త‌ప్ప‌దు. మిలిట‌రీని రంగంలోకి దింప‌డం త‌ప్ప చైనాకు మ‌రో మార్గం లేదు`` అని ఈ చైనా ఎక్స్‌ప‌ర్ట్  తేల్చిచెప్పారు. చైనాను తాము అడ్డుకోగ‌ల‌మ‌ని అమెరికాకు నిరూపించ‌డం కోస‌మే ఇండియా ఇలా రెచ్చ‌గొడుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ``గ‌తంలో ఉన్న ఒబామా ఇండియాకు గౌర‌వం ఇచ్చేవారు. కానీ ట్రంప్ అలా కాదు. బీజింగ్‌ను త‌ట్టుకోవ‌డం న్యూఢిల్లీ వ‌ల్ల కాద‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. అందుకే ఇండియా ఇలా ప్ర‌త్యేకంగా నిరూపించుకోవాల్సి వ‌స్తున్న‌ది`` అని ఆయ‌న అన్నారు. చైనా కంటే ఇండియా ఎంతో వెనుక‌బ‌డి ఉంద‌ని, అందుకే ఆ దేశాన్ని తాము ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా అస్స‌లు చూడ‌బోమ‌ని మిలిట‌రీ ఎక్స్‌ప‌ర్ట్ సాంగ్ జాంగ్‌ పింగ్ చెప్పారు. చైనీస్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కంటే ఎంతో బ‌లంగా ఉంద‌ని, ఈ విష‌యంలో కామ్‌ గా ఉంటే ఇండియాకే మంచిద‌ని హు అన్నారు.


Tags:    

Similar News