చైనా అధికారిక మీడియా వాళ్ల లెక్కన ఇండియా ఏడు తప్పులు చేసిందట. వాళ్ల ప్రాంతంలో వాళ్లు పనిచేసుకుంటుంటే.. ఇండియానే బుల్‌డోజర్లతో వెళ్లి అడ్డుకున్నదట. అసలు డోక్లామ్ ప్రాంతం చైనాదే అని ఇండియా కూడా అంగీకరించిందట. పక్కనున్న చిన్న దేశాన్ని (భూటాన్) మభ్యపెట్టి ఆ దేశ భూభాగానికి రక్షణగా ఉంటున్నామని చెబుతున్నదట. ఈ వీడియో చూస్తే డోక్లామ్ విషయంలో చైనా తీరేంటో స్పష్టంగా తెలుస్తోందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెప్తున్నారు. చట్టాలను గౌరవించాలని మీ అమ్మ మీకెప్పుడూ చెప్పలేదా అంటూ అందులో యాంకర్ వేసే ప్రశ్న నిజంగా ఆ దేశం దిగజారుడుతనానని నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇండియా కావాలనే నిద్ర నటిస్తున్నదని, వాళ్లను నిద్ర లేపడం అసాధ్యమనీ ఈ వీడియోలో చైనా ఆరోపించింది.
కాగా, చైనా అధికారిక మీడియా మనపై ఆరోపించిన ఏడు అంశాలు ఇవే...
1. వివాదాస్పద సరిహద్దులో ఉన్న డొక్లాంలోకి భారత్ చైనా అనుమతి లేకుండా ప్రవేశించింది. భారీగా ఆయుధ సామగ్రితో పాటు బుల్డోజర్లను పెట్టి చైనాను రెచ్చగొట్టే రీతిలో భారత్ వ్యవహరించింది.
2.దేశాల మధ్య సఖ్యత కోసం ఉద్దేశించిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించింది.
3.డొక్లాం చైనాలో భాగమని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నప్పటికీ...వివాదాస్పద ప్రాంతంగా చెప్పడం భారత్ తీరుకు నిదర్శనం. చట్టాలు ఉల్లంఘించకూడదని భారత్‌కు ఏ దేశం సలహా ఇవ్వలేదా?
4.చైనా తప్పు చేసింది అంటూ భారత్ ఎదురుదాడి చేస్తోంది. అయితే దీన్ని ప్రపంచం గమనిస్తోంది.
5. భారత్ తప్పుచేయడమే కాకుండా బాధితులమైన చైనాపైనే ఆరోపణలకు దిగుతోంది.
6.అనవసరంగా భూటాన్‌ను ఈ వివాదంలోకి లాగారు.
7. చర్చలకంటే ముందు చైనా భూభాగంలోకి వచ్చిన సైనికులు వెనక్కువెళ్లాల్సిందే.
వీడియో కోసం క్లిక్ చేయండి