అత్యంత అమానుషం : విమానం దిగి మనుషుల వీపులపై నడిచిన చైనా రాయబారి

Update: 2020-08-19 17:00 GMT
సాధరణంగా ఎవరైన విదేశీ అధికారులు మన దేశానికీ వారికీ రెడ్ కార్పెట్ పరచి స్వగతం చెప్పడం సాధారణ విషయమే. కానీ,ప్రపంచం ఇంత అభివృద్ధి పథంలో పోతున్నా కూడా మానవత్వం లేని స్వాగతాలు ఉంటాయా అని ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. సంప్రదాయం పేరుతో ఏకంగా ఓ మనిషి సాటి మనుషుల మీద నడిచి వెళ్లే సంప్రదాయపు స్వాగతం వివాదంగా మారింది. ఈ ఘటనకు వేదిక కిరిబాటి ద్వీపంలో చోటుచేసుకుంది. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువ కురుస్తుంది.

తమ దేశంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన చైనా రాయబారి టాంగ్ సాంగన్‌.. విమానం దిగిన తర్వాత దారిపొడవునా బోర్లా పడుకున్న యువకుల వీపుల పైనుంచి నడిచివెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఇద్దరు యువతులు ఆయన చేతులు పట్టుకుని ముందుకు నడిపించారు. ఈ నెలలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం గురించి భౌగోళిక రాజకీయ చర్చను కూడా పునరుద్ఘాటించింది. దీంతో స్పందించిన కిరిబతి ప్రభుత్వం.. ఇందులో తప్పేం లేదని, అతిథులను ఇలా ఆహ్వానించడం తమ సంప్రదాయంలో భాగమని సమర్ధించుకుంది.

ఆ దేశం నెటిజన్లు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి తమ దేశ పర్యటనకు వచ్చినప్పుడు, పెళ్లిళ్ల సమయంలోనూ తాము ఇలాగే స్వాగతం పలుకుతామని ఓ నెటిజన్ తెలిపారు. కిరిబతిలోని చైనా రాయబార కార్యాలయం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది.. ఈ నెల ప్రారంభంలో తమ రాయబారి ఉత్తర, దక్షిణ టాబిట్యూయా, మరకేయిలలో పర్యటించారు. కిరిబతి సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవడం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం, సహకార అవకాశాలను అన్వేషించడంలో భాగంగా సందర్శించారని తెలిపింది.
Tags:    

Similar News