దాయాది దేశంలో చైనా సైన్యాలు తిష్టవేసేందుకు రంగం సిద్ధమవుతోందా ? అంటే అవుననే చెబుతోంది పాకిస్ధాన్. ఇండియా చుట్టుపక్కల దేశాల్లో చైనా వ్యూహాత్మకంగా తిష్టవేయటానికి పెద్ద ప్లానేచేసింది. ముందుగా అప్పులిచ్చే పేరుతో పాకిస్ధాన్, శ్రీలంక, బాంగ్లదేశ్ తో సంబంధాలు పెట్టుకుంది.
తర్వాత నేపాల్ ను కూడా తన ఫోల్డర్లోకి తెచ్చుకున్నది. అప్పులివ్వటం, ఆయా దేశాల్లో ప్రాజెక్టులు చేసి డెవలప్ చేస్తానని ముందుగా చెబుతుంది.
అడిగినంత అప్పులివ్వటమే కాకుండా తమ దేశాలను డెవలప్ చేస్తానని చెప్పిన కారణంగా పై దేశాలు చైనాతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. చివరకు ఏమవుతుందంటే అప్పులు తిరిగి కట్టలేని స్ధితికి చేరుకున్నాక మెల్లిగా ఆయా దేశాల్లోని కొంత భూభాగాలను 99 ఏళ్ళకు లీజుకివ్వాలని ఒత్తిడితెచ్చి మరీ తనదారిలోకి తెచ్చుకుంటుంది. ఒకవైపు శ్రీలంకలోను ఇపుడు పాకిస్ధాన్లోను చైనా చేస్తున్నదిదే. పాకిస్ధాన్లోని సీపెక్ క్యారిడార్ రక్షణకు తన రక్షణదళాలను పాకిస్ధాన్లో దింపేందుకు పెద్దఎత్తున ప్లాన్ చేస్తోంది.
తమరెండు దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు ఔట్ పోస్టులు నిర్మించుకునేందుకు అనుమతివ్వాలని అందులో తమ సైన్యమే ఉంటుందని పాక్ ప్రభుత్వంపై చైనా ఒత్తిడి మొదలుపెట్టింది. డ్రాగన్ ఒత్తిడికి పాక్ ప్రభుత్వం లొంగిపోతే ఇండియా-పాక్ సరిహద్దుల్లో పాకిస్ధాన్ సైన్యంతో కలిసి లేదా విడిగానే చైనా తన సైన్యాన్ని దింపటం ఖాయం.
అదే జరిగితే మనకు చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే రక్షణరంగంలో మనకన్నా డ్రాగన్ చాలా పటిష్టమైన స్ధితిలో ఉంది.
పాకిస్ధాన్లోని కీలకమైన గ్వదార్ ప్రాంతంలోని ఎయిర్ పోర్టును తమ దళాలు వాడుకునేందుకు శాశ్వతంగా అనుమతివ్వాలని గట్టిగా పట్టుబడుతోంది. ఒకసారి చైనాను తమదేశంలోకి అనుమతిస్తే చివరకు పాకిస్ధాన్ డ్రాగన్ కాలనీలుగా మారిపోతాయని స్ధానికులు నానా గోలచేస్తున్నారు. ఒకవైపు చైనా ఒత్తిడి మరోవైపు లోకల్ జనాల నుండి తీవ్రమైన వ్యతిరేకత. దీంతో ఏమిచేయాలో పాక్ ప్రభుత్వానికి అర్ధం కావటంలేదు.