కరోనా అంతం గురించి చెప్పిన చైనా జ్యోతిష్యుడు..

Update: 2022-08-09 10:30 GMT
ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా. చైనాలో పుట్టిన  ఈ వైరస్ దాదాపు అన్నిదేశాలకు విస్తరించింది. కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని ప్రజలందరికీ విడదల వారీగా డోసులు వేస్తున్నారు. కానీ ఇప్పటికీ కేసులు నమోదువుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల పాటు ఎక్కువగా.. మరికొన్ని రోజులు తక్కువగా..  మొత్తంగా కేసులు నమోదవుతున్నాయి.  జీరో స్థాయికి మాత్రం రావడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ వైరస్ ప్రపంచాన్ని ఎప్పుడు వదిలివెళుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందటే ఓ జ్యోతిష్యుడు ఈ వైరస్ అంతం గురించి చెప్పాడు. కరోనా పుట్టినిల్లు చైనాకు చెందిన జ్యోతిష్యుడే ఈ విషయాన్ని చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఎవరు..? ఏలా చెప్పగలిగాడు..?

కొంతమంది జ్యోతిష్యులు తమకు కలిగిన జ్ఓానం ప్రకారం భవిష్యత్ గురించి చెబుతూ ఉంటారు. మనదేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఒానం గురించి ప్రాచుర్యంలో ఉంది. అయితే వీరు చెప్పినవి కొన్ని నిజమవుతుండడం విశేషం. అయినా చాలా మంది శాస్త్రవేత్తలు వాటికి ఆధారం లేనందున నమ్మొద్దని సూచిస్తున్నారు. అయితే వారి కాలంలో ఏర్పడిన పరిస్థితులనుసరించి ఊహాజనీతంగా భవిష్యత్ ను అంచనా వేసి ఉంటారని అంటున్నారు. ఇక కరోనా వైరస్ పుట్టుక గురించి.. అంతం గురించి ఓ చైనా జ్యోతిష్యుడు ఓ పుస్తకంలో రాశాడని అంటున్నారు.

చైనాకు చెందిన లియూ బోవెస్ అనే జ్యోతిష్యుడు ‘ద టెన్ వర్రీస్’ అనే పేరుతో ఉన్న కవితలో కరోనా గురించి ప్రస్తావించాడు. ఈ కవిత ప్రకారం  ర్యాట్, క్యాట్ ఈయర్స్ మధ్య కాలంలో ఓ విపత్తువస్తుందని, అది డ్రాగన్, స్నేక్ సంవత్సరాల్లో అంతమవుతుందని అందులో పేర్కొన్నాడు. చైనీస్ జొడియాక్ సంవత్సరాల ప్రకారం  ర్యాట్ ఇయర్ 2019లో ప్రారంభమైంది. క్యాట్ ఇయర్ 2020 జనవరి 25న ప్రారంభమైంది. ఈ రెండు కాలాల మధ్య పుట్టిందే కరోనా వైరస్. చైనాలోని వూహాన్ లో 2019 డిసెంబర్ 1న తొలి కేసును గుర్తించారు. ఆ తరువాత ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి.

ఈ వైరస్ డ్రాగన్, స్నేక్ మధ్య కాలంలో అంతమవుతుందని చెప్పాడు. అంటే డ్రాగన్ ఇయర్ 2024లో ప్రారంభమవుతుంది. స్నేక్ ఇయర్ 2025లో మొదలవుతుంది. ఈ రెండు కాలాల మధ్య కరోనా పూర్తిగా అంతమవుతుందని జోవెన్ ఆ కవితలో పేర్కొన్నాడు. అయితే కొందరు వీటిని కొట్టిపారేస్తున్నారు. ఏ ఆధారం లేకుండా ఎలా చెప్పగలుగుతారని అంటున్నారు. వందల సంవత్సరాల కిందట ఇప్పుడు జరిగే పరిస్థితుల గురించి ఎలా అంచనా వేస్తారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇలా చెప్పడం వల్ల జాగ్రత్తగా ఉంటారని అంటున్నారు.

కానీ ఎవరు ఏం చెప్పినా కరోనా అంతానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు. కొందరు జ్యోతిష్యలు భవిష్యత్ గురించి అంచనాలు వేస్తున్నా.. వాటిని ఆపగలిగే శక్తి మాత్రం ఎవరికీ లేదు. అలాగని ఎవరూ నిర్లక్ష్యం చేయడం లేదు. వచ్చిన విపత్తును తట్టుకోవడానికి నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. అయితే మానవ సమాజం అలవాట్లు, ఆహార విషయంలో తేడాలు రావడంతో ఇలాంటి వైరస్ లు పుట్టుకొస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News