ఒక్కోసారి ఏదో అనుకుంటే ఇంకేదో అవుతూ ఉంటుంది! చైనా వ్యాపారవేత్త లీ లియాంగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన కొన్ని అంచనాలతో భారీ వ్యయ ప్రయాసలకు ఓర్చి ఒక విమానాన్ని కొన్నారు. అయితే, అది ఆయన అనుకున్న సమయానికి చైనా రాలేదు. చాలా ఆలస్యంగా వచ్చింది. దాంతో ఖర్చు తడిసిమోపెడైంది. అలాగని, ఆ విమానాన్ని ఎంతో కొంతకి వదిలించేసుకుని నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు! కొత్త ఆలోచనతో లాభాలను పెంచుకునే ప్రయత్నం చేశారు. విమానంతో డబ్బులు సంపాదించాలంటే... అది ఆకాశంలో ఎగరాల్సిన అవసరమే ఏముంది? వీధుల్లో పార్కింగ్ చేసి కూడా సంపాదించొచ్చు అనుకున్నారు. ఈ ఆలోచన వర్కౌట్ అయింది. ఇప్పుడా విమానమే అతిపెద్ద విందు భోజనశాలగా మారింది.
లీ లియాంగ్ గత ఏడాది ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ నుంచి బోయింగ్ 737 విమానాన్ని కొనుగోలు చేశారు. అయితే, అది చైనాకు వచ్చేసరికి ఆరునెలలు సమయం పట్టేసింది. ఎందుకంటే, మధ్యలో మౌంటింగ్ - షిప్పింగ్ - రకరకాల లైసెన్సులు - ట్రేడ్ డిక్లరేషన్లు - కస్టమ్స్ ఇలా పేపర్ వర్క్ అంతా పూర్తి చేసుకునేసరికి ఆరునెలలు గడిచిపోయింది. ఆ తరువాత, విమానం ఇండోనేషియా నుంచి చైనాలోని ఊహాన్‌కు చేరేసరికి మరో నాలుగు నెలలు పట్టింది. కొనుగోలు చేసిన విమానం గాల్లో రాలేదు! నీటిలో వచ్చింది. బోయింగ్ 737 విమానాన భాగాల్ని విడగొట్టి, వాటిని జాగ్రత్తగా పార్సిల్ చేసి 70 కంటెయినర్లలో సర్దారు. వాటిని సముద్ర మార్గం ద్వారా చైనాకు తరలించారు. ఈ క్రమంలో మరో నాలుగు నెలల కాలం స్వాహా. ఇవన్నీ పూర్తయి విమానం చైనాకు వచ్చేసరికి అనుకున్నదానికంటే ఖర్చు అధికం అయిపోయింది.
ఆ విధంగా ఊహాన్ చేరిన పాత బోయింగ్ విమానాన్ని లీ ఆప్టిక్స్ వ్యాలీ వీధిలో ఒక రెస్టారెంట్ గా మార్పులు చేసి ఏర్పాటు చేశారు లీ. దానికి ముద్దుగా లిల్లీ ఎయిర్ వేస్ రెస్టారెంట్ అని పేరు పెట్టారు. బాగా రద్దీగా ఉన్న వీధిలో దీన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు జనం ఎగబడుతున్నారు. బోయింగ్ లో భోజనం చేసేందుకు ముచ్చటపడుతున్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు రకరకాల భోజన పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నారు. భోజనం ఖరీదు 30 నుంచి 40 డాలర్ల వరకూ ఉంటుంది. విమానంలోకి కాక్సిట్ స్టిములేటర్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే 40 నుంచి 60 డాలర్లు వసూలు చేస్తున్నారు. మొత్తానికి లిల్లీ ఎయిర్ వేస్ సూపర్ సక్సెస్ అయింది.