సమాజంలో కనుమరుగు అవుతున్న మానవత్వానికి ఇదో ఉదాహరణ. తూర్పు చైనాలో ఈ దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కర్కశంగా ప్రవర్తించాడు. విభేదాల కారణంగా జాంగ్ అతని భార్య విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో భార్య ఒక కారు కావాలని జాంగ్ ను డిమాండ్ చేసింది. తన కొడుకును అమ్మితే కారు కొనిపెట్టవచ్చనే ఉద్దేశంతో 9 వేల 606 యువాన్ లకు కొనుగోలు చేసేలా ఇంటర్నెట్ లో కొడుకు ఫొటోను పోస్ట్ చేశాడు. ఒకవ్యక్తి ఏకంగా 80 వేల యువాన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ ఆఫర్ జాంగ్ కు భలే నచ్చేసింది. దీంతో కొడుకును అమ్మేసేందుకు సిద్ధమయ్యాడు.
ఒప్పందం ప్రకారం కొనుగోలుదారుడికి అప్పగించేందుకు గడ్డకట్టే చలిలో లిన్ యాన్ పట్టణంలోని రోడ్డుపై బాబును ఎత్తుకుని కన్నతండ్రి జాంగ్ దాదాపు 10 నిమిషాలు నిలబడ్డాడు. చలికి తట్టుకోలేక ఆ పసిబిడ్డ ఏడుస్తున్నా ఆ కర్కోఠకుడి మనస్సు మాత్రం కరుగలేదు. ఈ దృశ్యాలు అన్ని రోడ్డు పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై మానవతవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/