కలకలం:అమెరికాలో చిక్కిన చైనా లేడి గూఢచారి

Update: 2020-07-24 06:45 GMT
అమెరికా ఆరోపణలకు బలం చేకూరేలానే చైనా కుట్రలు పన్నుతోంది. తాజాగా చైనా లేడి గూఢచారి అమెరికన్ ఎఫ్బీఐ అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది.

కరోనాతో అల్లకల్లోలంగా మారిన అమెరికా దానితో పోరాడుతుంటే సెలైంట్ గా విద్యార్థిగా ఎంట్రీ ఇచ్చిన ఓ అందమైన చైనా లేడి గూఢచారి తన పని తాను చేసుకుంటోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై అమెరికా కారాలు మిరియాలు నూరుతోంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి.

ఇక కొంత కాలంగా అమెరికా అగ్ర కంపెనీలైన యాపిల్, అమెజాన్ వంటి 20 కంపెనీలపై చైనా గూఢచర్యం చేస్తోందని అమెరికా పత్రిక సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై రచ్చ జరుగుతోంది. చైనా ఫ్యాక్టరీలు తయారు చేసి మదర్ బోర్డును వాడుతున్న అమెరికన్ కంపెనీలపై డ్రాగన్ గూఢచర్యం చేస్తోందని ఆ మదర్ బోర్డుల్లో ఓ మైక్రో చిప్ ను అమర్చి .. అమెజాన్, యాపిల్ వంటి 28 ఇతర అమెరికా కంపెనీలు, సంస్థల సర్వర్లను చైనా హ్యాక్ చేస్తోందని ఆ పత్రిక కథనం తెలిపింది.

తాజాగా అనుమానాలకు బలం చేకూరేలా ఏకంగా ఓ చైనా గూఢాచారి పట్టుబడడంతో అమెరికా ఉలిక్కిపడింది. అది కూడా ఓ చైనా మిలటరీ అధికారి కావడం సంచలనంగా మారింది.తన అందచందాలతో అమెరికన్లను ఈ బ్యూటీ ముంచేసి అక్కడి సమాచారాన్ని చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

అమెరికాలోకి ఓ విద్యార్థిలా ఎంట్రీ ఇచ్చి అక్కడి కేన్సర్ ఆస్పత్రిలో రీసెర్చ్ స్టూడెంట్ గా చేరింది. నెమ్మదిగా అక్కడి సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్టుగా ఎఫ్.బీ.ఐ అధికారులు గుర్తించారు.

పట్టుబడిన తర్వాత విచారించగా.. గూఢాచర్యం చేస్తున్న యువతి చైనీస్ మిలటరీ ఆఫీసర్ ‘తంగ్ జువాన్’గా గుర్తించారు. ఈమెతోపాటు అమెరికాలోకి మొత్తం 25మంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు వచ్చినట్లుగా ఎఫ్.బీ.ఐ అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు.
Tags:    

Similar News