రోహిత్ భార్య ఫేక్ ఖాతా.. వైరల్ స్పిన్ లో అశ్విన్

ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో చోటు దక్కకపోవడంతో రిటైరైన అశ్విన్ ఆ వెంటనే స్వదేశం చేరుకున్నాడు.

Update: 2025-01-06 12:30 GMT

టీమ్ ఇండియా క్రికెటర్లలో సోషల్ మీడియాలో హుషారుగా ఉండేది ఇటీవలే రిటైరైన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో చోటు దక్కకపోవడంతో రిటైరైన అశ్విన్ ఆ వెంటనే స్వదేశం చేరుకున్నాడు. దీని తర్వాత సోషల్ మీడియాలో అతడు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. బాక్సింగ్ డే టెస్టు (మెల్‌బోర్న్‌) లో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ తక్కువ స్కోరుకు ఔటవడం, స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు వికెట్లను త్వరత్వరగా కోల్పోవడంపై అశ్విన్ పెట్టిన ట్వీట్లు నాయకత్వం, ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు మరోసారి అశ్విన్ ట్వీట్లు చర్చనీయాంశం అయ్యాయి.


నకిలీలు చూసుకోబడ్లా..?

ఎక్స్ గా మారిన సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ లో నకిలీల బెడద ఎక్కువ. ఎవరికి వారు ఫేక్ ఖాతాలతో పోస్టులు పెడుతుంటారు. తమకు ఇష్టం లేని వారిని వేధించేందుకు ఇలాంటివాటిని ఓ సాధనంగా వాడుతుంటారు. అసలు ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ఎలాన్ మస్క్ ఓ దశలో వెనక్కు తగ్గడానికి కారణం ఫేక్ ఖాతాలే. ఇప్పుడు ఇలాంటి నకిలీ ఖాతాకే ట్వీట్ కొట్టి బొక్కబోర్లా పడ్డాడు అశ్విన్.

రోహిత్ భార్య అనుకుని..

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సనే. తరచూ పలు అంశాలపై ఆమె పోస్టులు పెడుతుంటారు. అయితే, రితికా పేరిట ఉన్న నకిలీ ఖాతాను చూసుకోకుండా అశ్విన్ చాట్ చేయడం గమనార్హం. చివరకు నకిలీ ఖాతాగా గుర్తించి డిలీట్ కొట్టాడు. అప్పటికే ఈ సంగతి అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది.

హాయ్ అంటూ పలకరించి..

రితికా పేరిట ఉన్న ట్విటర్ హ్యాండ్లర్ నుంచి అశ్విన్ కు ఓ పోస్ట్ వచ్చింది. దీనిని అతడు అసలైనదిగా భావించి.. ఆమెకు ప్రశ్నలు వేశాడు. ''హాయ్ రితికా, ఎలా ఉన్నావు? కుటుంబానికి నమస్కారాలు!'' అని ట్వీట్ చేశాడు. అయితే, అవతలి వ్యక్తి సున్నితంగా స్పందిస్తూ, ''నేను బాగున్నాను అశ్విన్ అన్నా'' అని సమాధానం ఇచ్చారు. దీంతో అది నకిలీ ఖాతా అని అశ్విన్ గ్రహించి, వెంటనే తన పోస్ట్‌ తొలగించాడు.

స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తాడు. క్రికెట్ లోనూ తన మేధస్సు ఉపయోగించి వికెట్లు తీసేవాడు. అలాంటివాడు సోషల్ మీడియాలో తప్పులో కాలు వేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Tags:    

Similar News