అలా చేస్తే మ‌న‌కే దెబ్బ అంటున్న డ్రాగ‌న్‌

Update: 2017-08-14 18:29 GMT
తామేం చేసినా త‌ప్పు కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే బుద్ధి చైనాలో క‌నిపిస్తుంది. ప్ర‌తి విష‌యంలోనూ ఎదుటోడి మీద త‌ప్పు నెట్టేసే చైనా.. తాజాగా భార‌త్ తీసుకున్న నిర్ణ‌యంపై మండిప‌డింది. త‌మ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా భార‌త్ నిర్ణ‌యం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. చైనా నుంచి భార‌త్ కు దిగుమ‌తి అయ్యే 93 చైనా ఉత్ప‌త్తుల‌పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టంపై ఆ దేశ అధికార మీడియా మండిప‌డింది.

చైనాకు చెందిన పెట్టుబ‌డిదారులు భార‌త్ లో పెట్టుబ‌డి పెట్టే ముందు ఆలోచించాల‌న్న సూచ‌న‌లు చేయ‌టంతో పాటు.. యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తే చోటు చేసుకునే ప‌రిణామాల‌కు భార‌త్ సిద్ధంగా ఉండాల‌ని వార్నింగ్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.  భార‌త్ నుంచి చైనాకు దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల‌పై చైనా కూడా అద‌న‌పు సుంకాలు విధిస్తుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఢిల్లీ చ‌ర్య‌ల‌తో చైనాకు న‌ష్టం పెద్ద‌గా ఉండ‌ద‌ని.. ఎందుకంటే చైనాకు భార‌త్ ఎగుమ‌తులు 12.3 శాతం త‌గ్గ‌గా.. అదే స‌మ‌యంలో భార‌త్ కు చైనా దిగుమ‌తులు 2 శాతం పెరిగాయ‌న్న విష‌యాన్ని గ్లోబ‌ల్ టైమ్స్ త‌న తాజా క‌థ‌నంలో గుర్తు చేసింది. వాణిజ్య ప‌రంగా ఆంక్ష‌లు విధించటం ద్వారా చైనాతో వాణిజ్య యుద్ధంతో భార‌త్ సిద్ధ‌మైంద‌ని పేర్కొంది. భార‌త్‌కు వాణిజ్య లోటు పెర‌గ‌టంతో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పేర్కొంది.

భార‌త్ లో చైనా సంస్థ‌లు పెట్టుబ‌డి పెట్ట‌క‌పోతే న‌ష్ట‌పోయేది భార‌తేన‌ని పేర్కొంది. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో చైనా వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ చేయాల‌న్న ప్ర‌చారం  భార‌త్ లో ఎక్కువ కావ‌టంపై ఆ దేశం కుత‌కుత‌లాడుతోంది. ఇలాంటి ప్ర‌చారాలతో అంతిమంగా భార‌త్ న‌ష్ట‌పోతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఇలాంటివి భార‌త్ లో ఉద్యోగ క‌ల్ప‌న‌పై ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌న్న హెచ్చ‌రిక‌ను చైనా చేసింది. చూస్తుంటే.. చైనాకు చెక్ పెట్టేలా.. చైనా పొగ‌రు అణిగేలా దేశ ప్ర‌జ‌లు నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. చైనా వ‌స్తువుల‌కు ప్ర‌త్యామ్నాయంగా దేశీయ పారిశ్రామిక‌వేత్త‌లు.. వ్యాపార‌వేత్త‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News