కరోనా విషయంలో ప్రపంచం ముందు చైనా దోషిగా నిలబడింది. అయినప్పటీకీ చైనా తీరులో మార్పు రావడం లేదు. ‘కుక్కతోక వంకర అన్నచందంగా’ చైనా వ్యవహరిస్తుంది. నిన్నటి వరకు ఏ ఆహార అలవాట్లతోనే చైనీయులు ఇబ్బందిపడ్డారో.. మళ్లీ అటువైపే అడుగులు వేస్తుండటంతో ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. కరోనా(కోవిడ్-19) నుంచి ప్రజలు బయటపడ్డారన్న సంతోషంతో చైనీయులు కుక్కలు - పిల్లులు - గబ్బిలాలు - తేళ్ల మాసం కోసం ఎగబడుతున్నాయి. వీటిని పిక్కుతిని విజయోత్సవాలు చేసుకుంటున్నారు.
చైనాలోని వూహాన్లో కరోనా వైరస్ సోకింది. ఇది క్రమంగా వూహాన్ నగరాన్ని చుట్టిముట్టింది. అక్కడి నుంచి క్రమంగా చైనాలోని ఇతర ప్రాంతాలకు సోకింది. దీంతో చైనాలో కొన్ని నెలలపాటు లాక్డౌన్ వంటి కఠిన చర్యలు చేపట్టారు. వూహాన్లో క్రమంగా కరోనా కేసులు తగ్గడంతో తాజాగా లాక్డౌన్ ఎత్తివేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం చైనీయులకు శుభవార్త తెలిపింది. దీంతో చైనీయులు పెద్దఎత్తున సంబరాలను తెరతీశారు.
ఇన్నాళ్లు లాక్డౌన్ తో ఇబ్బందిపడిన ప్రజలు ఒక్కసారిగా పెద్దఎత్తున మాంసం కొనుగోళ్లకు ఎగబడ్డారు. సౌత్ వెస్ట్ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు - పిల్లులు - తేళ్లు - గబ్బిలాలు - పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు - జంతువుల మాంసం షాపుల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కొన్నిరకాల చైనా ఆయుర్వేద షాపులు పలురకాల జీవుల మాంసాలతో రోడ్లపై దర్శనిమివ్వడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. అయితేనేం.. తమ అలవాట్లను మార్చుకోనేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. ఎప్పటిలాగే చైనీయులు జంతువులును పిక్కుతినేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా చైనాలో కరోనా వైరస్ కు తోడు ‘హంటా’ వైరస్ ప్రబలిన సంగతి తెల్సిందే.
కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే.. చైనీయులు ఎప్పటిలాగే వైరస్ వ్యాప్తి చేసే జంతువులను మళ్లీ పీక్కుతింటూ ‘చచ్చినా.. మేం మారమంటూ..’ సంబరాలు చేసుకుంటుంది. ఇప్పటికైనా చైనీయులు వారి ఆహార అలవాట్లలో మార్పులు చేసుకొని ప్రపంచ మానవాళికి ప్రశాంతతను చేకూర్చాలని కోరుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదు.