భారత సరిహద్దులోకి చైనా సైనికుడు.. అదుపులోకి తీసుకున్న ఆర్మీ !

Update: 2020-10-19 17:30 GMT
లడఖ్‌ లోని చుమర్, డెమ్ ‌చోక్ ప్రాంతంలో చైనా సైనికుడిని భారత సైన్యం అరెస్టు చేసి , అదుపులోకి తీసుకువచ్చింది. అతను భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో ఆర్టీ అదుపులోకి తీసుకున్నది. అయితే, అతను అనుకోకుండా పొరపాటున సరిహద్దు దాటి ఉండవచ్చని భారత సైన్యం భావిస్తున్నది. ప్రస్తుతం ఆ చైనా ఆర్మీ జవాన్ సేఫ్ కస్టడీలో ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా సైనికుడి దగ్గర సివిల్‌, మిలిట‌రీ డాక్యుమెంట్లు ఉన్న‌ట్లు భార‌త అధికారులు గుర్తించారు. భారత భూభాగంలోకి వచ్చిన చైనా సైనికుడిని కోర్పోరల్ వాంగ్ యా లోంగ్ గా గుర్తించారు. ఆ జవాన్ వెరిఫికేషన్ పూర్తి అయిందని, ప్రోటోకాల్ ప్రకారం స‌మాచారం సేక‌రించిన త‌ర్వాత అత‌న్ని తిరిగి చైనా ఆర్మీకి అప్ప‌గించ‌నున్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

సైనికుడికి ఆక్సిజన్, ఆహారం, వెచ్చని దుస్తులతోపాటు వైద్య సహాయం అందించినట్లు, తీవ్రమైన ఎత్తు, కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి అతన్ని రక్షించడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. తప్పిపోయిన సైనికుడు ఆచూకీ గురించి చైనా సైన్యం నుంచి భారత సైన్యానికి అభ్యర్థన అందింది. ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత అతడిని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో చైనా అధికారులకు తిరిగి ఇస్తామని ఇండియన్‌ ఆర్మీ అధికారులు చెప్పారు. కాగా, జూన్ 14న తూర్పు లడఖ్ సరిహద్దులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అప్పటి నుండి సరిహద్దుల్లో టెంక్షన్ వాతావరణం ఏర్పడింది.
Tags:    

Similar News