లేహ్‌.. ల‌డ‌ఖ్ లో చైనా జెండాలు పాతింద‌ట‌!

Update: 2019-07-13 04:49 GMT
దాదాపు రెండేళ్ల క్రితం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని డోక్లాంలో చైనా చొర‌బ‌డే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆ సంద‌ర్భంలో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన‌టం.. అందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ కావ‌టం తెలిసిందే. అయితే.. ఆ సంద‌ర్భంలో రెండు దేశాల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌తో పాటు.. భార‌త జ‌వాన్లు స్పందించిన తీరుతో డ్రాగ‌న్ దేశం వెన‌క‌డుగు వేయాల్సి వ‌చ్చింది.

మ‌ళ్లీ ఇప్పుడు చైనా మ‌రోసారి త‌న బుద్ధి చూపించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా జ‌మ్మూక‌శ్మీర్ లోని లేహ్‌- ల‌డ‌ఖ్ లోని వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న దెమ్ చోక్ గ్రామంలో చైనా జెండాలు పాతిన‌ట్లుగా పేర్కొంటున్నారు. ఇప్పుడీ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.

లేహ్ - ల‌ఢ‌ఖ్ లోని వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న గ్రామంలో టిబెట్ బౌద్ధ గురువు ద‌లైలామా పుట్టిన‌రోజు వేడుకలు దెమ్ చోక్ గ్రామంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ స‌మయంలో చైనా నుంచి వ‌చ్చిన కొంద‌రు త‌మ భూభాగంలో చైనా జెండాలు పాతిన‌ట్లుగా స‌ద‌రు గ్రామ స‌ర్పంచ్ ఉర్గేయిన్ చోడ‌న్ పేర్కొన్నారు. ఇదే విష‌యాన్ని భార‌త సైనికాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే.. లేహ్ లో చైనా ఎలాంటి చొర‌బాటుకు ప్ర‌య‌త్నించ‌లేద‌ని భార‌త సైన్యం స్ప‌ష్టం చేసింది. ఆ గ్రామంలో చైనా జెండాలు పాతిన వారంతా చైనీయులేన‌ని.. వారంతా సాధార‌ణ పౌరులేన‌ని పేర్కొంది. కాకుంటే.. వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. దేశం కాని దేశానికి వ‌చ్చి త‌మ దేశ జెండాల్ని పాతేసిన వారి విష‌యంలో భార‌త సైనికాధికులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌న్న విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌స్తే బాగుండేది.
Tags:    

Similar News