చైనాలోని వూహాన్ లో పుట్టిన మాయదారి కోవిడ్ - 19 వైరస్ పుణ్యమా అని యావత్ ప్రపంచమంతా వణికిపోతోంది. వైరస్ పాకి ఇప్పటికి ఆర్నెల్లు దాటినా.. ఇప్పటికి దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏమీ దొరక్క ప్రపంచ దేశాలు కిందా మీదా పడుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనప్పటికి.. ఒక్కో దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి.
కోవిడ్ వైరస్ కు పుట్టిల్లు లాంటి చైనాలో ఇటీవల ఒక కేసును టెస్టు చేసిన వేళ.. వచ్చిన ఫలితాలు వైద్యుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొత్త సందేహాల్ని తెర మీదకు తెస్తున్నాయి. ఇంతకూ విషయం ఏమంటే.. కోవిడ్ ప్రారంభంలో ఒక పెద్ద వయస్కురాలికి కోవిడ్ టెస్టు చేశారు. పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు వైద్యం చేశారు. ఆమె కోలుకున్నారు కూడా.
ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే తెర మీదకు వచ్చింది. ఆమె కోలుకున్న ఆర్నెల్ల తర్వాత అనారోగ్యంతో ఉండటంతో.. ఆమె వైద్యుల్ని సంప్రదించారు. ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేయగా.. తాజాగా మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. కోవిడ్ నుంచి బయటపడి.. తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమెకు.. మళ్లీ మరోసారి కోవిడ్ పాజిటివ్ గా రావటంతో వైద్యులు షాక్ అవుతన్నారు.
కరోనా నుంచి బయటపడిన వారికి.. మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చిన విషయంపై మీడియాలో బాగానే కవర్ అయ్యాయి. ఇప్పటివరకు అలా వెలుగు చూసినవన్ని.. సోకిన కొద్ది కాలానికి మరోసారి తిరగబెట్టటం ఒక ఎత్తు అయితే.. ఒ పెద్ద వయస్కురాలికి.. అందునా..కోలుకున్న ఆర్నెల్ల తర్వాత మళ్లీ పాజిటివ్ రావటంతో ఇప్పుడేం చేయాలన్నది వారి ముందు పెద్ద ప్రశ్నగా మారింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలిగిపోవటానికి ఎంత టైం పడుతుందన్న ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం కోసం వెతుకుతున్నారు చైనా వైద్యులు.