ఆగ్రహం అన్నది లేకుండా నిత్యం ప్రశాంత వదనంతో ఉంటారన్న పేరు గతంలో స్వాములోళ్లలకు ఉండేది. పురాణాల్లో మాదిరి కొందరు మునుల మాదిరి కొంతమంది స్వాములోళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తుంది. కొందరి ఆగ్రహంలో ధర్మాగ్రహం కనిపించినా.. మరికొందరు ప్రదర్శించే ఆగ్రహంలో ఆవేదన కనిపిస్తుంది. ఎంత ఆవేదన అయినా.. దేవుడి మీదన శపథాలు చేయటం మామూలు విషయం కాదు.
అలాంటి ఒక శపథాన్ని చేసి గతంలో సంచలనం సృష్టించారు చినజీయర్ స్వామి. బాబు పుణ్యమా అని తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేయటం తెలిసిందే. దీనిపై అప్పట్లో త్రిదండి చినజీయర్ స్వామి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపం నిర్మించకపోతే తాను స్వామి వారిని దర్శించుకోనంటూ శపథమే చేశారు.
పాలకులు చేసిన తప్పునకు దేవుడ్ని దర్శించుకోనంటూ ప్రకటించిన ఆయన దాదాపు పదమూడు.. పద్నాలుగు సంవత్సరాలుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఉంటున్నారు.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలుమార్లు తిరుమలకు వచ్చిన ఆయన.. శ్రీవారిని దర్శించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. అలా సంవత్సరాలుగా స్వామి దర్శనానికి దూరంగా ఉన్న ఆయన.. తాజాగా శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్నారు. తన శపథాన్ని పక్కన పెట్టి మరీ శ్రీవారిని దర్శించుకున్నారు. మరింత కాలం కట్టుబడిన శపథానికి ఇప్పుడెందుకు పక్కన పెట్టేశారన్నది స్వాములోరు వివరణ ఇస్తే బాగుంటుందేమో?