వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడైన జ్యోతుల నెహ్రు.. ఏపీ అధికారపక్షంలో చేరిపోవటం ఖాయమైన సంగతి తెలిసిందే. ఆయన సైకిల్ ఎక్కటం ఖాయమైన నేపథ్యంలో.. ఆయనకు ఏ పదవిని బాబు ఇవ్వనున్నారన్నది ఆసక్తికర చర్చగా మారింది. ఏపీ అసెంబ్లీ లాబీల్లోఈ విషయంపై ఆసక్తికర చర్చే సాగింది.
ఈ చర్చలో ఏపీ హోంమంత్రి చినరాజప్ప మీడియా ప్రతినిధులతోఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు విలేకరులు జ్యోతులకు ఏ శాఖను కేటాయిస్తారన్న ప్రశ్నను వేస్తే.. మరో విలేకరి మాత్రం కాస్తంత కొంటెగా మీ హోంను ఇస్తారట కదా? అంటూ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన చినరాజప్ప.. తన పదవిని జ్యోతులకు ఇవ్వరంటూ..‘‘ఆయన నీటిపారుదల శాఖ కోరుకుంటున్నారు. ఆ పదవి ఇస్తారేమో?’’ అంటూ బదిలిచ్చారు.
ఇప్పుడే పార్టీలోకి వచ్చిన జ్యోతులకు మంత్రి పదవి ఇస్తే.. మీ పార్టీలో క్యాబినెట్ లో స్థానం కోసం చకోరపక్షి మాదిరి ఎదురుచూస్తున్న తోట త్రిమూర్తులు మొదలుకొని చాలామందే నేతలు వెయిటింగ్ లో ఉన్నారు కదా? అన్న ప్రశ్నకు మాత్రం చినరాజప్ప బదులివ్వలేదు. చినరాజప్ప నోటి నుంచి వచ్చిన మాటతో.. జ్యోతుల మనుసులో ఏముందన్న విషయం బయటకొచ్చిందని చెప్పాలి. మరి.. జ్యోతుల మనసులోని కోరికను చంద్రబాబు ఏం చేస్తారో..?