చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది రాజకీయాల్లో చాలా పాపులర్ మాట. కానీ అధికారంలో ఉన్నవారు తమకు సంబంధించిన వారి విషయంలో పట్టించుకోనట్లు ఉంటారనే భావన బలంగా ఉంటుంది. అయితే ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రం తమ ప్రభుత్వం ఇందుకు భిన్నమని చెప్తున్నారు. తప్పు చేస్తే తమ వారినైనా వదిలేది లేదని చెప్తూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశి విషయంలో క్లారిటీ ఇచ్చారు.
అధికార తెలుగుదేశం పార్టీనేత - కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ శివారులోని రామవరప్పాడులో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు నిమిత్తం స్థానిక కాల్వకట్టపై ఉన్న ఇళ్లు తొలగించనున్నట్లు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికి నిరసనగా స్థానికులు రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే వంశీ వారికి సర్దిచెప్పి వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే ఎమ్మెల్యే వంశీ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, రాస్తారోకో చేయడం వలకల వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో పలు సెక్షన్ల కింద వంశీతోపాటు మరో 200 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఎపిసోడ్ పై ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమానికి హాజరై సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీపై నమోదైన కేసు, అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొంటూ విచారణలో తప్పు చేసినట్లు తేలితే శిక్ష తప్పదని హోంమంత్రి తేల్చిచెప్పారు. దీంతో వంశీ, ఇన్నర్ రింగ్ రోడ్డ్ ఇష్యూ అంతతేలిగ్గా సమసే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.