సుజనాను పంది అన్న ప్రముఖసినీ రచయిత

Update: 2017-01-26 07:54 GMT
ఇదో సంబంధం లేని కాంబినేషన్. ఒక రాజకీయ నేతను మరోరాజకీయ నేత విమర్శలు చేయటం.. నానా మాటలు అనటం మామూలే. మిగిలిన రంగాల వారు రాజకీయ నేతల మీద విమర్శలు చేయరని చెప్పటం లేదు కానీ.. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వారిపై సంచలన రీతిలో వ్యాఖ్యలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.

తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయంగా పేర్కొన్న ఆయన.. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని ఆందోళనలు చేసే వారు.. ఏ కోళ్ల పందాలో.. పందుల పందాలో నిర్వహించుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

సుజనా వ్యాఖ్యలపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదాను అడ్డుకున్న సుజనా చౌదరే పందిగా ఆయన మండిపడ్డారు. ‘హోదాకు అడ్డు పడిన పందివైన సుజనాతోనే  ఆట స్టార్ట్ చేస్తాం’’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరిక చేశారు. హోదా కోసం పోరాడుతున్న జగన్ ను కానీ పవన్ కల్యాణ్ నుకానీ విమర్శిస్తే ఊరుకోమని వ్యాఖ్యానించిన చిన్నికృష్ణ.. విద్యార్థుల్ని అడ్డుకోవటం ద్వారా హోదా ఉద్యమం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. హోదాపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తుంటే.. ఆయన తరహాలోనే ఏపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పలువురు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News