చింతమనేని ప్రభాకర్... తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ఫైర్ బ్రాండ్ నేత గురించి పరిచయం అవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేక స్థానం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత చింతమనేని మునుపటి దూకుడు చూపించడం లేదన్న చర్చ అలా ఉంచితే, సుదీర్ఘకాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఓ టీవీ ఛానల్లో ముఖాముఖిలో పాల్గొన్న చింతమనేని తన బాస్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తేడా వస్తే చంద్రబాబు తోలు వలిచే రకం అని చింతమనేని తెలిపారు.
గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా మంత్రి కొడాలి నానిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. అయితే, దీర్ఘకాలంగా తనకు మిత్రుడైన కొడాలి నాని గురించి, ప్రస్తుతం చర్చల్లో నిలుస్తున్న గుడివాడ కాసినో కలకలం గురించి చింతమనేని ఘాటుగా స్పందించారు. ఇలాంటి కాసినో వ్యవహారంలో కొడాలి నాని లాగా తన పేరు బయటకు వస్తే చంద్రబాబు తన తోలు తీసేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుడివాడ లాంటి కాసినో వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.
మంత్రి కొడాలి నానితో తన స్నేహం గురించి చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ, తమ నాయకుడైన చంద్రబాబును కామెంట్ చేసే వారు తన స్నేహితులు అయినప్పటికీ అలాంటి వారితో తను అనుబంధం అవసరం లేదని తెలిపారు. నానితో తనకు సత్సంబంధాలు లేవని తేల్చిచెప్పిన చింతమనేని తన కూతురు వివాహానికి ఆయన్ను ఆహ్వానించలేదన్నారు. కాసినో కలకలంలో తనవైపు నుంచి తప్పు జరిగిందని కొడాలి నాని ఒప్పుకొని ఉంటే హుందాగా ఉండేదని చింతమనేని చెప్పారు.