కోడెల శివప్రసాద్ రావు కొడుకూ, కూతురు పరారీ.. ఆ తర్వాత కూన రవి కుమార్ పరారీ.. ఇప్పుడు జాబితాలో చింతమనేని పేరు వచ్చి చేరింది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న నేతల్లో టీడీపీకి సంబంధించిన వారి ఒక్కో పేరే చేరుతూ వస్తోంది.
కే ట్యాక్స్ వ్యవహారాల్లో కోడెల శివరాం - పూనాటి విజయలక్ష్మిలు పరారీలో ఉన్నట్టుగా ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారు కోర్టు ముందుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
ఇక పరారీలో ఉన్న నేతల్లో యరపతినేని పేరు కూడా వినిపించింది. మైనింగ్ వ్యవహారాల్లో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. వాటి వాడి నుంచి తప్పించుకునేందుకు ఆయనా కొన్ని రోజుల పరారీ వార్తల్లోకి వచ్చారు. ఇక కూన రవికుమార్ కూడా అదే జాబితాలోకే ఎక్కారు.
ఆ వ్యవహారంలో ఆయనపై పోలీసు కేసు నమోదు కాగా అరెస్టును తప్పించుకునేందుకు ఆయన కూడా పరారీ మార్గానే ఎంచుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ అనుకున్న చింతమనేని కూడా ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా కార్లో పరార్ అయినట్టుగా తెలుస్తోంది.
దళితులను దూషించిన వ్యవహారంలో చింతమనేని పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అందుకు సంబంధించి అరెస్టు చేయాలని పోలీసులు చింతమనేని ఇంటికి వెళ్లగా ఆయన అప్పటికే పరార్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పరారీ తెలుగుదేశం నేతల సంఖ్య బాగా పెరుగుతున్నట్టుగా ఉంది. ఇంకా ఈ జాబితాలోకి ఎవరెవరు చేరతారో!