ఏలూరు వస్తే చెప్పుతో కొడతానంటూ సవాల్

Update: 2016-06-03 17:10 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ‘‘చంద్రబాబును చెప్పుతో కొట్టండి’’ అన్న వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఏపీ టీడీపీ నేతలు వరుస పెట్టి జగన్ పై మాటల దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరూ తమదైన శైలిలో జగన్ పై తీవ్ర మండిపాటును ప్రదర్శిస్తున్నారు. మాటల తూటాల్ని విసురుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల నోటి నుంచి మాట వినిపించకుండా మండిపడుతున్నారు.

ఇలా సాగుతున్న ఏపీ తమ్ముళ్ల మాటల ఎదురుదాడికే హైలెట్ అన్నట్లుగా తీవ్రమైన వ్యాఖ్యను చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తన మాటలతో.. చేతలతో తరచూ చెలరేగిపోయే ఆయన జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని.. జగన్ కానీ ఏలూరు వస్తే తాను అయన్ను చెప్పుతో కొడతానని.. ఒకవేళ కొట్టకపోతే తాను ప్రభాకర్ నే కాదంటూ సవాలు విసిరారు.

ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ జగన్ పై తీవ్ర మండిపాటును ప్రదర్శించిన ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ పద్ధతిగా మాట్లాడాలని.. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? అంటూ చెలరేగిపోయారు. చింతమనేని వ్యాఖ్యల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మరెంతలా స్పందిస్తారో..?
Tags:    

Similar News