టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. పోలీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన ను అణిచివేయాలని అనుకున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో్ పనిచేసి.. తనపై అనేక కేసులు మోపారని.. ఆయన తెలిపారు. దీంతో తాను ఒక సందర్భంగా తీవ్రంగా బాధపపడ్డానని ఆయన అన్నారు. గతంలోనే తనపై కేసులు ఉన్నా.. వాటికి కొన్ని కార ణాలు ఉన్నాయని అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య ప్రోద్బలంతో తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఉత్తిపుణ్యానికే.. కేసులు నమోదు చేశారని చెప్పారు.
తను ఎవరికీ ఇబ్బంది కలిగించకపోయినా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్ల ఎస్ ఐలు తనకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని..తమ విధులకు ఆటంకంకలిగించినట్టు తమకు తామే కేసులు పెట్టుకుని ఎఫ్ ఐఆర్ నమోదు చేసి జిల్లా మొత్తం తిప్పారని అన్నారు. తర్వాత మూడు రోజుల పాటు జైల్లో పెట్టారని అన్నారు. ఒక సీఐ కూడా తనకు వ్యతిరేకంగా కేసులు పెట్టుకున్నారని.. నిజానికి తాను తన కుమార్తె వివాహానికి సంబంధించి మాట్లాడే పనిలో ఉంటే కూడా తనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారని చింతమనేని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పెట్టిన కేసుల్లో కేవలం బాధపడిన సందర్భం ఇదేనని వెల్లడించారు.
అయితే.. తనను ఇంతగా వేదించిన వారిని ఊరుకునే ప్రసక్తి లేదని చింతమనేని చెప్పారు. అట్టుపెట్టినమ్మకు అట్టున్నర పెట్టాల న్న సామెతను నిజం చేస్తానని.. పోలీసులే అంత దిగజారితనపై కేసులు నమోదు చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వారికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. అంతేకాదు.. ఇప్పటికే హిట్ లిస్ట్ రెడీ చేసుకున్నట్టు చెప్పారు. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో ఇరికించారని.. ఇది ఎవరికైనా బాధకాదా? అని ప్రశ్నించారు. ఇదే విషయాన్నితానుపోలీసులను కూడా ప్రశ్నించానన్నా రు. ఎవరో చెప్పారని కేసులు ఎలా పెడతారని అన్నారు. తనపై పెట్టిన కేసులన్నీ పెట్టీ కేసులేనని.. ఒక్కటి కూడా నిలిచేది కాదని చెప్పారు. తనను ప్రజలు ఆశీర్వదిస్తారని.. ఖచ్చితంగా గెలుస్తానని.. అన్నారు.