చింతమనేని రాజీనామా..ధూళిపాళ్లదీ అదే రూటు

Update: 2017-04-02 07:48 GMT
మంత్రివర్గ విస్తరణ చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. తాజా విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంతో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తనకు అవకాశం లభించనందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  అయితే పార్టీ మారే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారి కార్యకర్తలను అవమాన పరచలేనని పేర్కొన్నారు. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు.
    
అంతకుముందు ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.  భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు  కార్యకర్తలతో భేటీ అయ్యారు. కష్టపడి పార్టీ కోసం పని చేసినా తగిన గుర్తింపు రాలేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన చింతమనేని కార్యకర్తలతో అన్ని కోణాల్లో చర్చించారు. ఆ వెంటనే రాజీనామా నిర్ణయం ప్రకటించారు. మరోసారి కార్యకర్తలతో భేటీ అయిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తానని ఆయన ప్రకటించారు.
    
కాగా మంత్రి పదవి లభించనందుకు నిరసనగా మరో నేత కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   పార్టీ కోసం కష్టపడి పని చేసినా ఫలితం లేకండా పోయిందనీ, ఇరత పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పెద్ద పీట వేశారని ఆవేదన చెందుతున్న ధూళిపాళ్ల భవిష్యత్ కార్యాచరణ పై తన ముఖ్య అనుచరులతో చర్చిస్తున్నారు. ఇలా ఉండగా పార్టీలో ఉండొద్దంటూ దూళిపాళ్ల అనుచరులు నినాదాలు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News