అధికారం ఆభరణంగా ఉండాలే తప్పించి.. అవసరానికి మించిన అహంకారం తెచ్చేదిగా ఉండకూడదు. మిగిలిన వారి సంగతిని పక్కన పెడితే.. ఏపీలోని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం తనకున్న పవర్ ను ఆయన ఎంతలా దుర్వినియోగం చేశారో మాటల్లో చెప్పలేని పరిస్థితి. బాబు చేతకాని తనం చింతమనేని చెలరేగిపోయేలా చేసిందన విమర్శ కూడా ఉంది.
ఎమ్మార్వో వనజాక్షి వ్యవహరం వెలుగు చూసిన వెంటనే చింతమనేనికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి ఉంటే.. బాబుకు ఈ రోజు ఇన్ని తిప్పలు ఉండేవి కావన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. చింతమనేని లాంటి వారిని వెంట పెట్టుకోవటం వల్ల బాబుకు లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చింతమనేని తరహా క్యాండిడేట్ల విషయంలో కేసీఆర్ అనుసరించే వైనాన్ని బాబు ఫాలో అయి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు సైతం తమ లోగుట్టు సంభాషణల్లో ప్రస్తావిస్తుంటారు. పొగరును అణచటం.. తప్పులు చేసిన వారికి చుక్కలు చూపించటం.. అధినేత అంటే గజగజ వణికేలా చేయటం లాంటివి కొన్ని ఒకప్పటి బాబు శిష్యుడైన కేసీఆర్ దగ్గర బాబు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
నాటు బ్యాచ్ విషయంలో పరమ వీర నాటుగా వ్యవహరించాలే తప్పించి.. ఆచితూచి అన్నట్లు వ్యవహరించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిదని చెబుతున్నారు. అదే పనిగా చెలరేగిపోతూ.. అనవసర వివాదాల్లో తలదూర్చే చింతమనేనికి ఇప్పటికే సరైన క్లాస్ పడి ఉంటే.. ఎన్నికల వేళ బాబు బ్యాచ్ కు ఇన్ని అవస్థలు ఉండేవి కావన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
నోటిని అదుపులో ఉంచుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఆయన కారణంగా ఈ రోజున మొత్తం టీడీపీ ఇరుకున పడిందని.. దళితులకు వ్యతిరేకమన్న ముద్ర పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. దళితుల్ని ఉద్దేశించి చింతమనేని చేసిన వెగటు వ్యాఖ్య వైరల్ గా మారటం ఏపీ అధికార పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది.
ఇదిలా ఉంటే.. తాను మాట్లాడిన వీడియో వైరల్ అయి పెను సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ చింతమనేని స్పందించారు. ఎప్పటిలానే తప్పును విపక్షాల మీద వేసిన ఆయన.. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కాకుంటే.. గతంలో మాదిరి కాకుండా కాస్త టోన్ తగ్గించిన చింతమనేని.. వీడియోలో ఉన్న తన మాటల్ని వక్రీకరించారని.. తాను దళితుల్ని కించపరిచేలా మాట్లాడానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.తన వీడియోపై దుమ్మెత్తి పోస్తున్న విపక్ష నేతల తీరును తప్పు పడుతూ ధర్నా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. తాను ఏ ఒక్క దళిత వ్యక్తిని బాధ పడేలా మాట్లాడలేదన్న ఆయన.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి వినపతిపత్రాన్ని ఇచ్చారు. వైరల్ వీడియో నేపథ్యంలో మాటలో కాస్త మార్పు వచ్చినా.. చేతల్లో మాత్రం రావాల్సిన మార్పు కొండంత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.