ఆయన తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్.. ఎప్పుడూ వివాదాలతో స్నేహం చేస్తుంటారు. తరచూ వివాదాలలో తల దూర్చుతూ అడ్డంగా బుక్కైపోతుంటారు. అయినా.. ఎన్నో కేసుల నుంచి శిక్ష పడకుండా తప్పించుకోగలిగారు. అలాంటి నేతలో గత ఎన్నికలు ఫైర్ తగ్గించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి సదరు నేతలోని ఫైర్ తగ్గిపోయింది. అంతేకాదు - ఫలితాలు వెలువడినప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికే ఆయనెవరో మీకు అర్థమై ఉంటుంది. ఆయనే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కొన్ని పనులపై విచారణ జరిపిస్తున్నారు. తాజాగా నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయించారు.
కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలకు సైతం నోటీసులు పంపించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేరే ఇంటికి మారాల్సిన పరిస్థితి తలెత్తింది. జగన్ దూకుడుతో టీడీపీ అధినేతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ సైతం భయాందోళనకు గురవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన తన అనుచరులతో రహస్య సమావేశం అయ్యారట. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో తనకే ఇబ్బందులు తప్పేలా లేవని కాబట్టి ఎవరూ రెచ్చిపోవద్దని చెప్పారనే టాక్ వినిపిస్తోంది.
చింతమనేని ఇంతగా భయపడిపోవడానికి ఆయనపై ఉన్న కేసులే కారణం. జగన్ కనుక ఈ మాజీ ఎమ్మెల్యేపై దృష్టి సారిస్తే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే చింతమనేని భయపడిపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పైపుల వివాదాన్నీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చంద్రబాబు కూడా చింతమనేనికి హెచ్చరికలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచే చింతమనేని ప్రభాకర్ వణికిపోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
చింతమనేనిపై 1995లో ఏలూరులో రౌడీ షీట్ నమోదైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీపై దాడికి దిగి జైలు పాలు కూడా అయ్యారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గం దెందులూరులో ప్రభుత్వోదోగిపై దాడి కేసులో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక, రాష్ట్రంలోనే కాక - దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనలో ఆయనపై ఏలూరు త్రీ టౌన్ లో కేసు నమోదైంది. అంతేకాదు, రూల్స్ పాటించలేదన్న ట్రాఫిక్ పోలీసు మీద దాడి - ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టడం ఇలా చింతమనేని ప్రభాకర్ పై దాదాపు యాభై కేసులు ఉన్నాయి.