తెలుగు రాష్ట్రాల్ని ఊపేసిన చింతామణి.. ఏపీలో బ్యాన్

Update: 2022-01-18 04:00 GMT
ఇప్పటి తరానికి కాస్త తెలీకపోవచ్చు కానీ.. 2000లకు ముందు పుట్టిన ప్రతి తెలుగువాడికి.. సుపరిచితం ‘చింతామణి’ నాటకం. ఈ నాటకం  ప్రదర్శించి ఇప్పటికి వందేళ్లు పూర్తి కావటమే కాదు.. దీని ప్రదర్శనపై బ్యాన్ విధిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. వందేళ్లు పూర్తైన వేళ.. శతజయంతి ఉత్సావాల పేరుతో ఏపీలో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఆర్యవైశ్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ నాటకంలోని సుబ్బిశెట్టి పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ మనోభావాల్నిదెబ్బ తీస్తున్నారంటూ ఆర్యవైశ్యులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నాటకంపై నిషేధాన్ని విధించాలని కోరుతూ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ వారిని కలుసుకొని తమ డిమాండ్లను ఏకరువు పెట్టే ఆర్యవైశ్యులు.. చింతామణి నాటకాన్ని  బ్యాన్ చేయాలని ప్రతి సీఎంను కలిసి వినతులు ఇచ్చారు.

తాజాగా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు.. చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన తక్షణ చర్యలు చేప్టటాలని సాంస్క్రతిక శాఖను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. నిజానికి కొంత కాలంగా చింతామణి నాటకాన్ని నిషేధించాలని వాదనలు వినిపిస్తున్నా.. దాన్ని ఏపీలో ఏర్పడిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్నది లేదు. ఈ నాటక ప్రదర్శన మొదలు పెట్టి వందేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో శతజయంతి వేడుకల పేరుతో ఈ నాటకాన్ని పెద్దఎత్తున ప్రదర్శిస్తున్నారు. దీంతో.. ఆర్యవైశ్యులు ఈ నాటకాన్ని మొదట్నించి వ్యతిరేకిస్తున్నారు.

ఇందులోని సుబ్బి శెట్టి పాత్ర తమ మనోభావాల్నిదెబ్బ తీస్తుందని ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఏపీలో చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవంటూ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. శతజయంతి వేడుకల్లో భాగంగా చింతామణి నాటకాన్ని ప్రదర్శించటం.. దీపిపై వైశ్యులు స్పందిస్తూ.. చింతామణిని   బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే తాము ఉద్యమం చేస్తామని ఆర్యవైశ్యులు స్పష్టం చేశారు.

ఇదే క్రమంలోనే తాజాగా జగన్ సర్కారు చింతామణి మీద బ్యాన్ ప్రకటించటంపై వ్యాపార వర్గాలు తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలింది తెలంగాణలో.. సీఎం కేసీఆర్ మరేం చేస్తారో చూడాలి. ఇక.. చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు ఆర్యవైశ్య సంఘాలు తమ హ్యాపీనెస్ ను పంచుకున్నాయి.

ప్రఖ్యాతగాంచిన  చింతామణి నాటక రచయిత కవి కాళ్లకూరి నారాయణరావు. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘము వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడింది.
Tags:    

Similar News