ఏపీ రాజకీయాలు అంతకంతకూ వేడెక్కిపోతున్నాయి. ఏపీ అధికార.. విపక్ష పార్టీల అధినేతలు తరచూ ఏర్పాటు చేస్తున్న సభలతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఒకరిపై ఒకరు చేసుకున్న రాజకీయ విమర్శలు.. వాటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వేడిని మరింత పెంచేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనలో మొదటి ముద్దాయి చిరంజీవేనని మండిపడిన ఆయన.. మీ అన్నను ఏమీ అనవేం పవన్ అంటూ నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కారణమైన చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే.. ఎందుకు అడగలేకపోతున్నావంటూ తప్పు పట్టారు.
చిరంజీవిని ప్రశ్నించటానికి. రక్తసంబంధం అడ్డొస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా? జనసేన పార్టీ ఎందుకు పెట్టావు? అన్న ప్రశ్నలతో పాటు.. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు తమ ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే.. వారిని బలిపశువు చేశారని మండిపడ్డారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనన్న చింతమనేని.. తనపై పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారని.. తననుఓడించి జనసేన అభ్యర్థిని గెలిపిస్తామని ఊగిపోతున్నారని.. కానీ అది సాధ్యం కాదన్నారు. మీరు కాదు.. మీ జేజమ్మలు దిగి వచ్చినా నన్ను ఓడించలేరంటూ చింతమనేని చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిన్నదానికే చెలరేగిపోయే పవన్ ఫ్యాన్స్.. చింతమనేని మాటలపై ఎలా స్పందిస్తారో..?