ఈ ఏడాది ఆచార్యతో కాస్త గట్టి దెబ్బే తిన్నారు.. మెగాస్టార్ చిరంజీవి. అయితే పడి లేచిన బంతిలా వెంటనే గాడ్ ఫాదర్‌తో తానెందుకు మెగాస్టారో నిరూపించారు. మళయాల సూపర్ హిట్ సినిమా.. లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కిన గాడ్‌ఫాదర్ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విజయంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.. చిరంజీవి. ఇప్పుడు ఆయన చేతిలో బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య, మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో వాల్తేరు వీరయ్య వచ్చే వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. మరికొన్ని కథలను కూడా చిరు వింటున్నారు.
కాగా గాడ్‌ఫాదర్ విజయవంతం కావడంపై వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. చిరంజీవి. ఈ క్రమంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు తదనంతర అంశాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తనపై ప్రత్యర్థులు దారుణ విమర్శలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. రక్తం అమ్ముకుంటున్నానని, భూమిని కబ్జాలు చేశానని ఆరోపణలు చేశారని నాటి పరిణామాలను గుర్తు చేసుకున్నారు. తనపై ఆరోపణలు చేసినవారు కోర్టుల ద్వారానో, లేదా స్వయంగా తెలుసుకోవడం ద్వారా అసలు నిజాలు తెలుసుకుని ఉంటారని చిరు అభిప్రాయపడ్డారు. తన తప్పు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి క్షమాపణలు చెప్పడానికి కూడా తాను వెనుకాడబోనన్నారు.
''నా రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల నేను బాగానే ఉన్నా. ప్రజారాజ్యం పార్టీ కొనసాగి ఉండుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదోక దానికే పరిమితమయ్యేవాడిని. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమై.. తెలంగాణను వదులుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు నటుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు దగ్గరగా ఉండగలుగుతున్నా. కాబట్టి పార్టీ లేకపోవడమే నాకు బాగుందనిపిస్తోంది''. అంటూ మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు.
లూసిఫర్ రీమేక్ చేయడం వెనుక ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఉన్నారని చిరంజీవి వెల్లడించారు. "లూసిఫర్ రీమేక్‌కి నేనే సరైన ఎంపిక అని చరణ్‌తో సుకుమార్ తన చర్చలో సలహా ఇచ్చాడు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాను సుకుమార్ చేయలేకపోయాడు" అని తెలిపారు.
పాటలు, కథానాయికలను కలుపుకోకుండా చేసిన తన ప్రయోగం యువ దర్శకనిర్మాతలను విభిన్న కథలతో రావడానికి స్ఫూర్తినిస్తుందని చిరంజీవి అంటున్నారు. ప్రయోగాత్మక సినిమాల్లో ప్రేక్షకులు నన్ను ఆదరిస్తే, నేను కొత్త సబ్జెక్ట్‌లను ప్రయత్నించగలనని చిరంజీవి వెల్లడించారు.
లూసిఫర్ ను రీమేక్ చేయాలనుకున్నప్పుడు దాన్ని అన్నాచెల్లెలు సెంటిమెంట్ ఉండాలని మోహన్ రాజా కోరుకున్నాడు. ఆ మేరకు ఆత్మ చెదరకుండా ఉండాలని.. కథనాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడని ప్రశంసించారు.
రీమేక్‌లు చేయడంలో చాలా రిస్క్ ఉందని చిరు అంటున్నారు. "మేము రీమేక్‌లు చేసేటప్పుడు ఎప్పుడూ పోలికలు ఉంటాయి. కాబట్టి, చాలామంది రీమేక్ చేయడానికి ధైర్యం చేయరు. కాబట్టి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా వాటిని చేస్తాను'' అని చిరంజీవి తెలపడం విశేషం.
ఇక ఆచార్య ప్లాప్ గురించి మాట్లాడుతూ.. తాను, రామ్ చరణ్ తమ పారితోషికంలో 80 శాతం రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేశామని వివరించారు. బయ్యర్లను ఆదుకున్నామన్నారు.
నటులు ఆలోచనా విధానాన్ని మార్చుకుని విభిన్నమైన కథలను చేపట్టాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. "బాలీవుడ్ తర్వాత మా బడ్జెట్ చాలా ఎక్కువ. మాకు పెద్ద సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. తెలుగు సినిమా మార్కెట్ చాలా పెద్దది. కాబట్టి, సేఫ్ బెట్ అనేది సాధారణమైపోయింది" అని చిరు హాట్ కామెంట్స్ చేశారు.
యువ దర్శకులకు ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సమాచార లభ్యత ఎక్కువ. అంతకుముందు, పరిమిత వనరులు పరిమిత సమాచారం ఉన్నాయి. యువ దర్శకులతో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు.
సెట్‌లో డైలాగులు రాసే దర్శకుల గురించి గతంలో తాను చేసిన ప్రకటనపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. "నేను దీన్ని ఎప్పుడూ అనుభవించలేదు, కానీ నేను ఇతరుల నుండి విన్నాను. దర్శకులు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లను నిర్వహించాలి, తద్వారా వారు స్క్రిప్ట్‌ను మెరుగుపరుచుకోవచ్చు. సెట్స్‌కి వెళ్లాక వర్క్ ఈజీ అవుతుంది. సమయం వృధా కాదు. అంతేకాకుండా అందరికీ మంచిది" అని వ్యాఖ్యానించారు..
గాడ్‌ఫాదర్‌లో సల్మాన్‌ఖాన్ ప్రత్యేక పాత్ర పోషించారని, ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులతో పనిచేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చిరు చెప్పారు. వివిధ పరిశ్రమలకు చెందిన నటీనటులు కలిసి పని చేయాలని ఆకాంక్షించారు.
''పాటలు, ఫైట్లు కచ్చితంగా ఉండాలని ఎన్నాళ్లు చేయగలుగుతాం. నాకైతే వీటి నుంచి కొంచెం దూరం వచ్చి బలమైన కథలు, పాత్రలతో నన్ను నేను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుంది. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలన్నీ వేసవి నాటికి విడుదలవుతాయి. మార్చి నుంచి కొత్త చిత్రాలు ప్రారంభిస్తా. బాబీ సినిమాలో నా పాత్ర ఫుల్ మాస్ లుక్‌లో ఉంటుంది. సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. దీనికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ నేనే పెట్టా. 'భోళా శంకర్' కూడా చాలా బాగుంటుంది''. అని చిరు స్పష్టత నిచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.