అన్న‌ను లైట్.. త‌మ్ముడికి ఎంతో ప్రాధాన్య‌త!

Update: 2017-12-25 04:42 GMT
ఆస‌క్తికర ప‌రిణామాల‌కు వేదిక‌గా మారింది రాష్ట్రప‌తి కోవింద్‌ కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ప్ర‌త్యేక విందు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రాక ఒక ప్ర‌త్యేకత అయితే.. మ‌రో స్పెషాలిటీ ప‌వ‌న్‌ క‌ల్యాణ్. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన సీన్ ఏమిటంటే.. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి హాజ‌రు కావ‌టం.

ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో ఒకే వేదిక మీద‌కు అన్నాద‌మ్ముళ్లు ఇద్ద‌రూ హాజ‌రు కావ‌టం చాలా చాలా త‌క్కువ‌. ఇదిలా ఉంటే.. రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన విందుకు హాజ‌రైన మెగాస్టార్ కంటే ప‌వ‌ర్ స్టార్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ల‌భించింద‌న్న మాట వినిపిస్తోంది.

ఇద్ద‌రు చంద్రుళ్ల‌తో స‌మానంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు గ‌వ‌ర్న‌ర్ ప్రాధాన్య‌త ఇవ్వటం స్ప‌ష్టంగా క‌నిపించింది. అదే స‌మ‌యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ప‌వ‌న్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడ‌టం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌లో బిడియంగా క‌నిపించే ప‌వ‌న్‌.. త‌న తీరుకు త‌గ్గ‌ట్లే ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే..ఆయ‌న ప‌ట్ల చాలామందిలో ప్ర‌త్యేక అటెన్ష‌న్ క‌నిపించింది.

అన్నాత‌మ్ముళ్లు ఒకే వేదిక మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇరువురికి స‌మాన గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా తాజా విందులో మాత్రం చిరంజీవి కంటే అధిక ప్రాధాన్య‌త ప‌వ‌న్‌ కు ద‌క్క‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.  ప‌వ‌న్‌ కు ల‌భించిన ప్ర‌త్యేక‌ ప్రాధాన్య‌తతో పాటు.. మెగాస్టార్‌ కు అంతంత‌గా  ల‌భించిన ప్రాధాన్య‌తపై ప‌లువురు మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. ఈ అన్నాద‌మ్ములు ఇద్ద‌రు క‌లిసి భోజ‌నం చేశారు. ఈ స‌న్నివేశం మెగా అభిమానుల‌కు విప‌రీత‌మైన ఆనందాన్ని క‌లిగించేదిగా చెప్పాలి.
Tags:    

Similar News