అన్న‌ద‌మ్ములు క‌లిస్తే.. అదిరిపోద్ది జ‌గ‌న‌న్నో.. వైసీపీలో క‌ల‌క‌లం!

Update: 2022-10-05 02:30 GMT
ఔను.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో క‌ల‌కలం రేగింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గంలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల‌కు 175 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న పార్టీ అధినేత‌కు ఈ పరిణామం మింగుడు ప‌డ‌డం లేద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌నేసేన రెండు పార్టీలు క‌లిస్తేనే... త‌మ‌కు అధికార పీఠం దూర‌మ‌వుతుంద‌ని.. వైసీపీ నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో `ద‌మ్ముంటే.. ఒంట‌రిగా పోటీ చెయ్‌!` అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
ఇక‌, జ‌గ‌న్ కూడా.. ముందుగానే ఈ విష‌యంలో మేల్కొన్నారు  జ‌న‌సేన‌-టీడీపీ ఎక్క‌డ క‌లిసి పోటీ చేస్తాయ‌ని అనుకున్నారో.. ఏమో.. ఆయ‌న ఆయా పార్టీలపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రెండు ఒక‌టేన‌ని.. న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు నేరుగా చెబుతున్నారు. ఇలా.. జన‌సేన‌-టీడీపీ క‌లిస్తేనే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని.. భావిస్తున్న వైసీపీకి ఇప్పుడు.. చిరు ప్ర‌యోగం.. ప్ర‌క‌ట‌న కూడా.. హ‌డ‌లెత్తి స్తోంద‌ని.. వైసీపీలోనే ఓ వ‌ర్గం నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఎందుకంటే.. చిరు అభిమానం.. ప‌వ‌న్ సేవా గుణం రెండూ క‌లిస్తే.. యువ ఓటు బ్యాంకు పూర్తిగా వారికే ద‌క్కుతుంది.

పైగా.. వీరు.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. వైసీపీ ఏదైతే ల‌క్ష్యంగా పెట్టుకుందో.. 175/175 అటు వెళ్లిపోయే అవ‌కాశం ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు మొత్తంగా వైసీపీ పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోవ‌డంఖాయం. అందుకే.. వైసీపీ నాయ‌కులు తాజా ప్ర‌క‌ట‌న‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అన్న‌-త‌మ్ముడు క‌లిస్తే..చిత్త‌డైపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం పెట్టిన చిరుకు.. ఇప్ప‌టికీ.. రాజ‌కీయంగా కొంత మంది నేత‌ల‌పై ప‌ట్టుంది. ఈ నేప‌థ్యంలో వారిని ప‌వ‌న్‌కు అనుకూలంగా మార్పు చేసే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని భావిస్తున్న వైసీపీ అసంతృప్తులు సైతం.. జ‌న‌సేన బాట ప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే అబిప్రాయం వ‌స్తోంది.

మ‌రోవైపు.. సామాజిక వ‌ర్గాల‌కు అతీతంగా కూడా.. జ‌న‌సేన‌లోకి చేరే నాయ‌కులు పెరుగుతార‌ని అంటున్నారు. ఎందుకంటే..  వైసీపీలో టికెట్ వ‌స్తుందో రాదో అనే బెంగ నాయ‌కుల‌ను వెంటాడుతోంది.  ఈ ప‌రిణామాల‌తో వైసీపీ భారీగా దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌ని.. గ‌తంలో ఒక్క ఛాన్స్ అంటేనే జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌జ‌లు.. ఇప్పుడు.. కొత్త నాయ‌కుడు.. పైగా.. చిరు వంటి మెగా.. కారెక్ట‌ర్ ఉన్న వ్య‌క్తి ద‌న్నుగా ఉంటాన‌ని చెప్ప‌డంతో మ‌రింతగా ప్ర‌జ‌లు ప‌వ‌న్‌వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని.. వైసీపీలో కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని స‌మాచారం.

దీంతో చిరు వ్యాఖ్య‌ల‌పై ఎలా రియాక్ట్ కావాలో.. వారికి అర్ధం కాని ప‌రిస్థితిగా మారింద‌ని అంటున్నారు. త‌మ వాడుగా..అనుకున్న చిరు.. త‌న త‌మ్ముడివైపు మొగ్గు చూప‌డంతో విజ‌యసాయిరెడ్డి వంటి నేత‌ల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్టే అయింద‌ని భావిస్తున్నారు.. మ‌రిదీనిపై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News