నిజమా.. చిరంజీవికి తమిళనాడు బాధ్యతలు?

Update: 2017-01-17 10:22 GMT
ఇన్నాళ్లూ సినీ రంగానికి దూరంగా ఉన్నందుకు తెగ ఫీలైపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ‘ఖైదీ నెంబర్ 150’ విడుదల సందర్భంగా రాజకీయాల ప్రస్తావన తెస్తే ఏమాత్రం ఆసక్తి లేనట్లు మాట్లాడాడు చిరు. ఏదో రాజకీయాల్లో ఉన్నానంటే ఉన్నా అన్నట్లు వ్యాఖ్యలు చేయడంతో 2019 ఎన్నికల్లో చిరు పాత్ర ఏమీ ఉండదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఆయన రాజకీయ సన్యాసం తీసుకంటాడేమో అని కూడా విశ్లేషణలు చేశారు కొందరు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఈ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. చిరు త్వరలోనే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సుముఖంగా ఉందన్న వార్తలు బలం చేకూర్చేలా.. చిరుకు త్వరలో ఓ కీలక బాధ్యత అప్పగించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జికి చిరును నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో చిరు పోషించబోయే కీలక పాత్రకు ముందు ఇది శాంపిల్ అంటున్నారు. డిమానిటైజేషన్ కు వ్యతిరేకంగా ఈ 18న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఐతే 18న ఎంజీఆర్ జయంతి నేపథ్యంలో తమిళనాట మాత్రం 20న ఆందోళనలు జరుగుతాయట. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతారని.. తమిళ నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని.. ఆ సందర్భంగానే చిరు పదవి గురించి కూడా కన్ఫర్మేషన్ వస్తుందని అంటున్నారు. ఇటీవలే చిరు.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News