కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి.. ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గోవాలో జరుగుతున్న చలన చిత్రోత్సవాల సందర్భంగా ఈ ఏడాదికి చిరంజీవిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందుకు చిరంజీవి అన్ని విధాలా అర్హుడే అనడంలో ఎవరికీ వీసమెత్తు సందేహం కూడా లేదు.
అయితే ఇటీవల కాలంలో బీజేపీ అధిష్టానం అడుగులను గమనించేవారికి మాత్రం ఇందులో కూడా ఏదో మతలబు ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో బీజేపీ పెద్దలు పలువురు తెలుగు సినీ నటులతో భేటీ కావడమే ఇందుకు కారణం.
వచ్చే ఏడాది చివరలో తెలంగాణలో, ఆ పై వచ్చే ఏడాది అంటే 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలోకి సినీ నటులను రప్పించి ప్రజలను తమ పార్టీ వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా బీజేపీ పెద్దలు సినీ నటులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మరో ప్రముఖ నటుడు నితిన్‌తో ¿ే టీ కావడం, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ప్రాధాన్యత, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా జాతీయ పురస్కారం ఇవన్నీ సినీ నటులను బీజేపీకి ఉపయోగించుకునే కార్యక్రమంలో భాగమేనని అంటున్నారు.
ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి జనాకర్షణ కలిగిన నేతలు లేరు. ఈ నేపథ్యంలో పుష్కళమైన ప్రేక్షకాదరణ కలిగిన హీరోలను తమ వైపుకు తిప్పుకోగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి లాభం చేకూరుతుందని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు.
సినీ నటులను తమ పార్టీలో చేర్చుకోవడం లేదా తమ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయించడమే బీజేపీ లక్ష్యమని చెబుతున్నారు.
అయితే బీజేపీ మాయలో పడిపోయేంత అమాయకులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కాదని అంటున్నారు. వాస్తవానికి 2009లో చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసినప్పుడే బీజేపీ ఆయనను ఆహ్వానించింది. చిరు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని, ఎన్నికల ఖర్చు, మీడియా మద్దతు అంతా తాము చూసుకుంటామని భరోసా ఇచ్చింది. అయితే చిరు సున్నితంగా ఈ ప్రతిపాదనకు నో చెప్పారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తాను ఎప్పటికైనా టీడీపీకి అసలు సిసలు వారసుడు కావాలని యోచిస్తున్నారు. సరైన సమయం కోసం ఆయన వేచిచూస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీలో చేరతారు లేదా ఆ పార్టీకి మద్దతిస్తారనేది అత్యాశేనని పేర్కొంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.