జ‌గ‌న్‌ను `ఢీ` కొట్టేందుకు ప‌వ‌న్ సంధించే కీల‌క అస్త్రం అదేనా.. చిరు హింట్‌!

Update: 2022-10-05 02:30 GMT
తాజాగా మెగా స్టార్ చిరంజీవి.. త‌న సోద‌రుడు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాలపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ప‌వ‌న్ నిస్వార్థ ప‌రుడ‌ని.. ఎలాంటి లాభం ఆశించ‌కుండానే.. పొరుగు వాడికి ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఉన్న‌వాడ‌ని.. చిరు చెప్పుకొచ్చా రు. సో.. ఈ కామెంట్ల‌ను బ‌ట్టి.. ఏపీలో వైసీపీ అదినేత జ‌గ‌న్‌ను.. ఆ పార్టీ నేత‌ల‌ను ఢీకొట్టేందుకుఅదే వ్యూహంతో ప‌వ‌న్ ముందు కు సాగే సూచ‌న‌లు ఉన్నాయ‌నే సంకేతాలు వ‌చ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశాల‌కులు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అన్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. త‌మకు సేవ చేయ‌డంతోపాటు.. నిస్వార్థంగా ఉండే నేత‌ను కోరుతున్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. తాను నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు వ‌స్తున్నాన‌ని.. విన‌న్నాన‌ని.. ఉన్నాన‌ని.. ఇలా జ‌గ‌న్ అనేక డైలాగులు పేల్చారు.కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం త‌న పార్టీ నేత‌లే దోచేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అక్ర‌మ ఇసుక‌, మ‌ట్టి, గ‌నులు.. ఇలా ఒక‌టి కాదు.. అనేక రూపాల్లో ప్ర‌జాధనాన్ని సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారనే టాక్ ఉంది అయినా.. జ‌గ‌న్ ఏమీ ప‌ట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ కు కూడా వాటాలు వెళ్తున్నాయ‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది.

ఇవిలావుంటే.. అవినీతి కంపు అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ సాగుతోందనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలే.. లంచాలు తీసుకుంటున్నార‌ని.. మండ‌ల స్థాయిలో చ‌ర్చ న‌డుస్తోంది. రైతు భ‌రోసా కేంద్రాల్లోనూ.. ద‌ళారుల పాత్ర పెరిగిపోయింద‌ని.. రైతులు చెబుతున్నారు. ఇలా.. ఇందు క‌ల‌దు.. అందు లేదు.. అన్న తేడా లేకుండా.. అవినీతి స‌హ‌స్ర రూపాల్లో.. విస్త‌రించి పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌మ‌కంటూ.. సేవ చేయ‌డ‌మే ప‌ర‌మావ‌థిగా పెట్టుకున్న నాయ‌కుడి కోసం.. స‌హ‌జంగానే ప్ర‌జ‌లు ఎదురు  చూస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఈ వాద‌న‌ను బ‌లంగా తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని .. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా చిరు చేసిన వ్యాఖ్య‌.. బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తే.. జ‌గ‌న్ ఢీ కొట్టేందుకు ప‌వ‌న్‌ను ప‌దునైన ఆయుధం ల‌భిం చిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

అంటే.. నిజాయితీ ప‌రుడు, నిస్వార్థంగా ప్ర‌జ‌ల ప‌క్షాన నిలుస్తారు.. అనేలా.. ఆయ‌న‌ను ప్రొజెక్టు చేసేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని అంటున్నారు. ఇది క‌నుక ఒక్క‌సారి ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ఇక‌, తిరుగులేని బ్ర‌హ్మాస్త్రంగా ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల కాలంలో కౌలు రైతు కుటుంబాల‌ను ఆదుకుంటున్న తీరు.. ప‌వ‌న్ నిస్వార్థ సేవ‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంద‌న‌డంలో సందేహం కూడా లేదు. సో.. చిరు హింట్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం అయితే ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News