చిరంజీవి నోట ఉద్యమం మాట

Update: 2016-02-01 10:24 GMT
 కాపుల కుల సమరం నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన మరోనేత, మెగా స్టార్ కూడా బయటకు వచ్చారు. జరిగినదానికి చంద్రబాబే కారణంటూ ఆరోపణల వర్షం కురిపించారు. ప్రజలు ఉద్యమించడానికి రెడీగా ఉన్నారంటూ ఈ స్టాలిన్ సినీ డైలాగులు చెబుతున్నారు. ఈ మేరకు చిరంజీవి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ లేఖలో డిమాండ్ చేసిన చంద్రబాబు  తునిలో జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని ఆవేదన వ్యక్తంచేశారు.

పారదర్శకత లేని పాలన కారణంగానే తుని ఘర్షణ చెలరేగిందని చిరంజీవి తేల్చారు.  ప్రజల మనోభావాల ఆధారంగా కాకుండా, విభజించు పాలించు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఎదురు దాడితో ప్రతిపక్షాల నోరు మూయించలేరన్న ఆయన కాపులు - బీసీలు - మహిళలే కాదని, రాజధాని కోసం భూములిచ్చిన వారు కూడా ఉద్యమించబోతున్నారని తన లేఖలొ పేర్కొన్నారు.

మరి అందరూ ఉద్యమిస్తారంటున్న చిరంజీవి ఇంతవరకు రాజధాని కోసం భూములిచ్చిన వారితో కలిసి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘువీరా ప్రభుత్వంపై పోరాడుతుంటే చిరంజీవి కనీసం అక్కడ ఒక్కసారి కూడా కనిపించలేదు ఎందుకో? అలాగే కాపుల సమస్యలపై తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా లేఖలు ఎందుకు రాయలేదన్నదీ ఆయనకే తెలియాలి.
Tags:    

Similar News