చిరంజీవికి రిలీఫ్ లభించింది. రాజకీయాల నుంచి బయటకు వచ్చి.. సినిమాలను సీరియస్ గా తీసుకున్న ఆయనకు పొలిటికల్ కెరీర్ లో నమోదైన కేసుల నుంచి ఆయన బయటపడుతున్నారు. తాజాగా 2014లో ఆయనపై నమోదైన కేసు విషయంలో హైకోర్టు నుంచి ఆయనకు ఊరట లభించింది.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవి ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లుగా అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన కేసు ఒకటి గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో 2014లో నమోదైంది. ఈ కేసు తాజా విచారణహైకోర్టు చేపట్టింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చిరంజీవి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లుగా ఆధారాల్ని చూపించలేకపోయారు.
దీంతో.. ఆయనపై నమోదైన కేసును రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. రజనీ ఉత్తర్వులు ఇచ్చారు. 2014 ఏప్రిల్ 27రాత్రి 10 గంల తర్వాత ఎన్నికల ప్రచారంచేసినట్లుగా అధికారులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని దిగువ కోర్టు విచారణ నిమిత్తం తీసుకోవటాన్ని సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణలో చిరు తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రచారానికి వెళ్లిన చిరంజీవి ముగించుకొని తిరిగి వస్తున్న వేళ.. అక్రమంగా కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వివరాల్ని కోర్టుకు అందజేశారు. వీటిని ఆధారంగా చేసుకున్న కోర్టు చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. 2014 నాటి కేసు నుంచి చిరు బయటపడినట్లైంది.