సినిమా ద్వారా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకొని.. నాకింత ఇచ్చిన మీకు.. నేనేం ఇవ్వాలంటూ అడిగే చిరుని చూసుకొని మురిసిపోని తెలుగోడు లేడు. ఆయనలాంటి క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలే కానీ.. కుళ్లును కడిగించేసి.. రఫ్ఫాడించేస్తాడని భావించారు. అందుకు తగ్గట్లు చాలానే కలలు కన్నారు. వారి కలలు ఫలించాయా అన్నట్లుగా.. నాటకీయంగా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం దాని గురించి చర్చ అనవసరం.
ఈ రోజు చిరంజీవి బర్త్ డే. ఆరో వసంతంలోకి అడుగు పెట్టిన ఆయన.. ఒక ప్రముఖ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా సినిమాలు.. లాంటి విషయాలే కాకుండా రాజకీయాల్లాంటి సీరియస్ అంశాల మీదా స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చి ఇన్నాళ్లు గడిచినా.. చిరు రాజకీయ అవగాహన.. ఆలోచనలు లాంటివి ఆయన మాట్లలోనే చదవాలి. మరి.. ఆయన సమాధానాల్లో మచ్చుతునుకల్లాంటి కొన్ని సమాధానాలు.. దానికి సామాన్యుడికి వచ్చే డౌట్లు చూస్తే..
= రాజకీయాల్లో రాణించలేకపోవటం గురించి స్పందిస్తూ.. ‘‘సినిమాల్లో టీమ్ తో కలిసి పని చేస్తే అలరించొచ్చు. రాజకీయాల్లో ఒక్కడి వల్లా.. టీం వల్లా ఏం కాదు. చేయని దానికి మాటలు పడే దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నెగ్గుకురావటం చాలా కష్టం. రాజకీయాలు నిరంతర పోరాటం‘‘
(చిరు మాట నిజమే అనుకుంటే.. ఒక మోడీ.. సోనియా..లాంటి వారు టీం కన్నా కూడా వ్యక్తులుగానే రాణించారు. నాయకుడు బలమైనోడు అయితే దేన్నైనా సాధించొచ్చని కేసీఆర్ తెలంగాణ సాధనతో నిరూపించారు. అంతదాకా ఎందుకు.. దివంగత నేత వైఎస్ సంగతే చూస్తే.. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా 2009 ఎన్నికల్లో ఎలా విజయం సాధించగలిగారు. మరి.. రాజకీయాల్లో ఒక్కడి వల్లా ఏం కాదనే చిరు మాటకు అర్థం ఏమిటో ఆయనకే తెలియాలి)
= పార్టీని కాంగ్రెస్ లో కలపకుండా బాగుండేదన్న వ్యాఖ్యలపై.. ‘‘అలాంటి మాటలు నేనూ విన్నా. అప్పటికి తీసుకున్న నిర్ణయం సరైందే. దాని గురించి బాధపడటం లేదు’’
(నిజమే.. చిరుకు బాధేం ఉంటుంది. ఆయన్ని నమ్మి ఓట్లేసిన వారికి షాక్ ఇస్తూ.. ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా ఓట్లేశారో.. ఆ పార్టీలోకి తీసుకెళ్లి కలపటం.. ఆయనకు ఓట్లేసిన వారికే బాధ ఉంటుంది మరి)
= తెలంగాణ నేతలంతా కలిసి అనుకున్నది సాధిస్తే.. ఏపీ నేతలు మాత్రం ఏం కావాలో కూడా అడగలేదు కదా అన్న దానికి.. ‘‘అడగలేదని అంటారు కానీ అడిగాం. అందుకే బిల్లులో వచ్చాయి. వాటిని తర్వాతి ప్రభుత్వాలు నెరవేరిస్తే ఏపీకి నష్టమే ఉండదు. సీమాంధ్ర నేతలు ఏకతాటిపై నడవలేదన్నది నిజం. రాష్ట్ర నేతలు ఒకలా.. కేంద్రస్థాయిలో మరోలా మాట్లాడారు. చివరి సీఎం కిరణ్ కూడా విభజన జరగదని ఏమార్చారు. అందుకే ఏమీ అడగలేదు.. తాత్కలిక యూటీనో.. శాశ్విత యూటీనో సాధించుకుంటే ఈ రోజు సెక్షన్ 8 వివాదం తలెత్తేది కాదు’’
(కిరణ్ ఏదో చెప్పిన నమ్మించాడని నెపం ఆయన మీదకు వేస్తున్న చిరు.. ఆ రోజే పెదవి విప్పలేదు. రాష్ట్ర విభజన ఖాయం.. ఏం కావాలో కోరుకోవాలి. లేదంటే.. శాశ్వితంగా నష్టపోతామని ఎందుకు మాట్లాడలేదు. ఇది సున్నిత విషయం అనుకుంటే.. విభజన తర్వాత పంచాయితీలు తలెత్తకుండా చట్టాన్ని పక్కాగా రూపొందేలా ఎందుకు కసరత్తు చేయలేదో..?)
= ప్రత్యేక హోదాపై పోరు మీరు మొదలుపెడితే.. ఇప్పుడు జగన్ రంగంలోకి దిగారే అన్న దానిపై.. ‘‘బంద్ లు.. ధర్నాలు చేస్తే సరిపోదు. కేంద్రాన్ని నిలదీయాలి. ఆయన నిలదీయలేరు. మొన్న ఢిల్లీలో ధర్నా చూశాం. అక్కడ వెంకయ్య.. మోడీ పేర్లను ప్రస్తావించలేదు. రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తారని నిలదీయగలిగారా? ఆ దమ్ము.. ధైర్యం ఆయనకు లేవు. ఆయనకున్న ఇబ్బందులేమిటో మనకు తెలీదు’’
(బుజ్జి బుజ్జిగా మాట్లాడే చిరు.. జగన్ ను విమర్శించే ముందు తన గురించి ఎందుకు ఆలోచించుకోరు. ప్రత్యేక హోదా గురించి చిరు లాంటి వ్యక్తి నిజాయితీగా పోరాడితే ఏపీ ప్రజలు వెంట రారా? ఆయన లాంటి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు దిగి.. మోడీ.. వెంకయ్యల మీద పోరు మొదలు పెట్టొచ్చుగా? రాజ్యసభ సభ్యుడిగా.. ఇప్పటికైనా ఒక్కరోజైనా ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్డీయే పక్షాన్ని దుమ్ము దులిపేసేలా ఎందుకు మాట్లాడలేకపోయారు. అలాంటి వ్యక్తికి జగన్ గురించి విమర్శించే హక్కు ఉందా?)
= జగన్ మళ్లీ.. కాంగ్రెస్ లో కలిసిపోతారన్న వాదన ఉందన్న ప్రశ్నకు.. ‘‘రాహుల్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అటువంటి పరిస్థితే వస్తే.. ఆ రోజు నా రియాక్షన్ చూస్తారు’’
(రాష్ట్ర విభజన లాంటి ఘోరాన్ని చూసిన ఒక సీమాంధ్ర నేతగానే నోరు మూసుకొని కామ్ గా ఉన్న చిరు.. జగన్ పార్టీలో కలిస్తే చూపించే రియాక్షన్ ఏమిటో? అమ్మకాని పిలిపించి.. మాట్లాడితే అంతా సెట్ అయిపోదూ?)
= మీ తమ్ముడు పవన్ కాంగ్రెస్ ను బాగా విమర్శించారు కదా అప్పుడేమనిపించిందంటే.. ‘‘పవన్ పూర్తి అవగాహనతో మాట్లాడలేదనిపించింది. నిజాలు తెలియక ప్రతిపక్షాల మాటల ప్రభావానికి లోనుకావటం వల్లే అలా మాట్లాడారనిపించింది. ఎక్కడ కలిసినా రాజకీయాల గురించి మాట్లాడుకోరాదన్నదే మా ఒప్పందం. అభిరుచులు.. అభిప్రాయాలు.. ధ్యేయం నాకన్నా భిన్నం. చరణ్ మాదిరే పవన్ కూడా నా బిడ్డే’’
(రాజకీయాల మీద మీకున్న అవగాహన.. పవన్ కున్న అవగాహన ఏమిటో ఈ రోజు తెలుగోళ్లకు బాగానే అర్థమైంది. రాజకీయాల్ని పక్కన పెడితే.. ఒక్కవిషయంలో మాత్రం మిమ్మల్ని అభినందించాలి. రాజకీయాలు వ్యక్తిగత అనుబంధాల విషయంలో ప్రభావితం కాకుండా చూసుకోవటంలో మీకు నూటికి నూటయాభై మార్కులు వేయాల్సిందే)
= ముఖ్యమంత్రి కావాలని మీరూ.. పవన్ ప్రయత్నిస్తున్నట్లున్నారంటే.. ‘‘మాకు పదవుల కాంక్ష లేదు. సేవా భావమే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన సేవ చేయలేమని కాదు. నాకు పదవే పరమావధి కాదు. పవన్ కు పదవీకాంక్ష ఉంటుందనుకోను’’
(పవన్ కల్యాణ్ సంగతిని కాసేపు పక్కన పెడితే.. మీకు పదవీ కాంక్ష అస్సలు ఉండదని.. సేవ చేయటానికి ప్రతిపక్షంలో కూడా ఉండి చేయొచ్చన్న మాటే నిజమైతే.. పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి.. కేంద్రమంత్రి పదవితో ఎందుకు ఓకే చెప్పినట్లో..?)