పోలీసుల అదుపులో చిరు, రఘువీరా

Update: 2016-02-08 07:58 GMT
ముద్రగడను కలిసి మద్దతు తెలపాలనుకుంటున్న నేతలకు చుక్కెదురవుతోంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును రాజమండ్రిలో హౌస్ అరెస్టు చేయగా తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి... ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలనూ రాజమండ్రిలోనే ఆపేశారు.  కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ చిరంజీవి, పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా.. పోలీసులు వారిని రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం వద్దే అడ్డుకున్నారు. దీంతో మధురపూడి విమానాశ్రయం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు, చిరంజీవి మద్దతుదారులు అక్కడికి చేరుకుని పోలీసులు వారిద్దరినీ విడిచిపెట్టాలని... ముద్రగడను వారు కలిసేందుకు ఎలాంటి ఆటంకాలు సృష్టించొద్దని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News