అవసరానికి తగ్గట్లు ఎదుటోడ్ని వాడేసే చిరంజీవికి సరికొత్త అనుభవం ఎదురవుతుందని చెబుతున్నారు. ఎవరినైనా సరే.. తాను వాడుకోవటమే కాదు.. తనను వాడుకునే అవకాశం ఇవ్వని చిరంజీవిని తాజాగా కాంగ్రెస్ పార్టీ వాడేయటం మొదలెట్టిందని చెబుతున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కుప్పలు తెప్పులుగా నాయకులు ఉండటం.. ఎవరికి వారు తమ కంటే పోటుగాళ్లు ఎవరూ లేరని బీరాలు పలకటం.. దీనికి తోడు సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న వారికి పెద్ద పీట వేస్తూ.. మధ్యలో వచ్చి చేరిన చిరంజీవిని కాస్త లైట్ తీసుకున్నారనే వాదన ఉంది. విభజన నేపథ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఏపీలో గల్లంతు అయితే.. తెలంగాణలో ఏదో ఉన్నామంటే.. ఉన్నామన్నట్లుగా ఉండటం తెలిసిందే.
ఎన్నికలు పూర్తయిన ఈ పద్నాలుగు నెలల్లో చోటు చేసుకున్న మార్పుల పుణ్యమా అని పార్టీలో ఎవరేంటన్న విషయంపై అధినాయకత్వం ఒక అవగాహనకు వచ్చిందని చెబుతున్నారు. రాజకీయంగా పెద్ద అవగాహన లేనప్పటికీ.. వ్యక్తిగత ఛరిష్మా చిరంజీవికి చాలా ఎక్కువన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం గుర్తించినట్లు వినికిడి. ఈ మధ్య కాలంలో చిరంజీవికి పార్టీలో ప్రాధాన్యత పెరిగిందంటున్నారు.
దీనికి తోడు ఏపీలో ఈ మధ్యన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటన సందర్భంగా చిరును చూసేందుకు ప్రజలు ఉత్సాహం ప్రదర్శించటం.. ఆయన మాటలకు స్పందన బాగుండటంతో.. చిరు మీద కన్ను పడిందని చెబుతున్నారు. యాత్రల సందర్భంగా చిరును తప్పనిసరిగా పిలవాలన్న భావనలో పార్టీ ఉన్నట్లుగా చెబుతున్నారు.
నటుడిగా సుపరిచితుడైన చిరును.. దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీ కార్యకలాపాల్లో వాడేసుకోవాలని పార్టీ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తమ ఇమేజ్ మసకబారిన ప్రస్తుత తరుణంలో.. స్వయం ప్రకాశితాలుగా కనిపించే చిరు లాంటి వారిని గుర్తించి.. వారికి మరింత ప్రోత్సాహం అందించాలని పార్టీ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. గతంలో ఎన్నడూ లేనంతగా.. రాహుల్ తో పాటు.. అధిష్ఠానం నాయకులు చిరుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఫూణెలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ తనతోపాటు చిరును వెంట పెట్టుకెళ్లటం దీనికి నిదర్శనం అంటున్నారు.
ఇంతకాలం పది మందిలో తాను ఒకడినన్న భావనలో ఉన్న చిరుకు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు చెబుతున్నారు. తమ నాయకుడి సత్తాను కాంగ్రెస్ అధినాయకత్వం గుర్తించటం పట్ల చిరు అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాడుకోవటానికి వీలుగా ఉంటే.. వాడేసుకోవటం చేతకానంత వెర్రిబాగుల పార్టీ ఏమీ కాదు కదా. ఏది ఏమైనా కాంగ్రెస్ లో చిరు సీన్ స్టార్ట్ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. తాజా పరిణామాల పట్ల చిరు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.