రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ.. ఆమె భర్త మోహన్ లను నగరపాలక సంస్థ కార్యాలయంలోనే అతి దారుణంగా హతమార్చిన హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం చిత్తూరు కోర్టులో న్యాయమూర్తి ముందు లొంగిపోవటం తెలిసిందే. చింటూ కోసం ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టటం.. అతన్ని పట్టుకోవటం కోసం పెద్దఎత్తున ప్రయత్నాలుచేశారు. కానీ.. పోలీసు ప్రయత్నాలకు చెక్ చెబుతూ.. సినిమాటిక్ గా చింటూ కోర్టులో లొంగిపోవటం విస్మయానికి గురి చేసింది.
కోర్టులో చింటూ లొంగిపోయిన తీరు చూస్తే.. అప్పుడెప్పడో విడుదలైన సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టులో లొంగిపోయే సమయంలో ముఖానికి హెల్మెట్ పెట్టుకోని వస్తాడు. కోర్టులోకి దూసుకొచ్చి ఒక్కసారి తన ముఖానికి ఉన్న హెల్మెట్ ను తీసేస్తాడు. తాజా ఉదంతంలో చింటూ అల్టో కారులో చిత్తూరు కోర్టుకు వచ్చి.. కారు దిగిన వెంటనే గొడుగు తీసి దాన్ని ముఖానికి కప్పుకొని కోర్టు వరకూ రావటం.. ఆవెంటనే గొడుగు మూసేసి.. న్యాయమూర్తి ఛాంబర్ వద్దకు వెళ్లి.. తాను లొంగిపోతున్నట్లుగా పేర్కొనటం సంచలనం రేపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే సమయంలో జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. చింటూ లొంగిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు. సినిమాటిక్ గా లొంగిపోయిన చింటూ చిత్తూరు జిల్లా పోలీసులకు పెద్ద షాకే ఇచ్చారని చెప్పొచ్చు.