సిక్స‌ర్ల వీరుడిగా క్రిస్ గేల్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే టాప్‌!

Update: 2021-04-13 10:30 GMT
‘క్రీజులో ఎంత సేపు ఉన్నామ‌న్న‌ది కాదు.. ఎన్ని ప‌రుగులు సాధించామ‌న్న‌దే కావాలి.’ టీ20 క్రికెట్ నినాదం ఇదే. అందుకే.. పించ్ హిట్టర్లకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్రాంచైజీలు కూడా వారి వెంటే పడుతుంటాయి. అలాంటి హిట్టింగ్ గురించి మాట్లాడితే.. క్రిస్ గేల్ పరాక్రమం గురించి చర్చ జరగకుండా ముగించలేం.

గేల్ క్రీజులోకి వచ్చాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకే అనడంలో సందేహమే లేదు. అంతలా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడేస్తుంటాడీ క‌రేబియ‌న్‌. హార్డ్ హిట్టింగ్ లో ప్ర‌పంచ క్రికెట్లోనే త‌న‌దైన ముద్ర వేసిన గేల్‌.. ఐపీఎల్ లోనూ శిఖ‌రాగ్రంలో ఉన్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ 351 సిక్స‌ర్లు సాధించి.. ఐపీఎల్ లోనే హ‌య్యెస్ట్ సిక్స‌ర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. త‌ద్వారా.. త‌న‌కు తిరుగేలేద‌ని చాటుకున్నాడు. నిన్న రాజ‌స్థాన్ తో జ‌రిగి‌న మ్యాచ్ లో రెండు సిక్సులు కొట్ట‌డం ద్వారా 350 మార్కును చేరుకున్నాడు గేల్‌. మ‌రి, గేల్ త‌ర్వాత ఎవ‌రెవ‌రు ఉన్నారో చూద్దామా..

క్రిస్ గేల్ - 351
ఏబీ డివిలియ‌ర్స్ - 237
ఎంఎస్ ధోనీ 216
రోహిత్ శ‌ర్మ 214
విరాట్ కోహ్లీ 201
పొలార్డ్ 198
సురేష్ రైనా 198
డేవిడ్ వార్న‌ర్ 195
షేన్ వాట్స‌న్ 190
రాబిన్ ఊత‌ప్ప 163
Tags:    

Similar News