‘జమైకా టు ఇండియా’ అంటూ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ విడుదల చేసిన ఓ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నది. కేవలం 24 గంటల్లోనే 40 లక్షల వ్యూస్ సాధించింది. క్రిస్ గేల్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
గేల్ క్రీజ్ లోకి వచ్చాడంటే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఎంతో సింపుల్‌గా అతడు సిక్సులు బాదుతుంటే ప్రేక్షకులకు అలాగే చూడాలని అనిపిస్తుంది. ఇక ప్రత్యర్థి బౌలర్లకు, ఫీల్డర్స్ కు గేల్ క్రీజ్ లో ఉన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. ఫీల్డర్స్ కు మరో సౌలభ్యం ఏమిటంటే అతడు బ్యాటింగ్ చేస్తే ఎక్కువగా పరుగెత్తి బంతిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేల్ ఎక్కువగా సిక్సర్లకే ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టించాడు.
జమైకాలో పుట్టిన గేల్.. బ్యాటింగ్ స్టయిల్ నచ్చని క్రికెట్ అభిమాని ఉండరేమే. ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తరఫున గేల్ ఆడుతున్నాడు. ఇవాళ అతడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎందుకంటే నేటి సాయంత్రం పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగనున్నది. ఇదిలా ఉంటే గేల్ ఇవాళ ఎటువంటి ప్రదర్శన ఇస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ’జమైకా టు ఇండియా’ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. కేవలం 24 గంటల్లోనే ఈ వీడియో 40 లక్షల వ్యూస్ సాధించింది. ఈ వీడియోలో బికినీ బేబీస్ తో క్రిస్ గేల్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ ఎమినే బంటాయ్ ఈ పాటను కంపోజ్ చేశారు. హిందీలో సాగే ఆ పాట నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
' గల్లీ బోయ్' చిత్రంతో ఫేమస్ అయిన ఎమినే బంటాయ్ గేల్‌తో కలిసి స్టెప్పులను అదరగొట్టాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గేల్ ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఈ నెల 1నే బాంటాయ్ రిలీజ్ చేశాడు. దీంతో ఈ వీడియోపై ఆసక్తి నెలకొన్నది. బాంటాయ్ తో కలిసి ఈ వీడియో చేయడం చాలా సంతోషంగా ఉందని గేల్ అన్నాడు.Full View
గేల్ క్రీజ్ లోకి వచ్చాడంటే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఎంతో సింపుల్‌గా అతడు సిక్సులు బాదుతుంటే ప్రేక్షకులకు అలాగే చూడాలని అనిపిస్తుంది. ఇక ప్రత్యర్థి బౌలర్లకు, ఫీల్డర్స్ కు గేల్ క్రీజ్ లో ఉన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. ఫీల్డర్స్ కు మరో సౌలభ్యం ఏమిటంటే అతడు బ్యాటింగ్ చేస్తే ఎక్కువగా పరుగెత్తి బంతిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేల్ ఎక్కువగా సిక్సర్లకే ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టించాడు.
జమైకాలో పుట్టిన గేల్.. బ్యాటింగ్ స్టయిల్ నచ్చని క్రికెట్ అభిమాని ఉండరేమే. ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తరఫున గేల్ ఆడుతున్నాడు. ఇవాళ అతడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎందుకంటే నేటి సాయంత్రం పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగనున్నది. ఇదిలా ఉంటే గేల్ ఇవాళ ఎటువంటి ప్రదర్శన ఇస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ’జమైకా టు ఇండియా’ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. కేవలం 24 గంటల్లోనే ఈ వీడియో 40 లక్షల వ్యూస్ సాధించింది. ఈ వీడియోలో బికినీ బేబీస్ తో క్రిస్ గేల్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ ఎమినే బంటాయ్ ఈ పాటను కంపోజ్ చేశారు. హిందీలో సాగే ఆ పాట నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
' గల్లీ బోయ్' చిత్రంతో ఫేమస్ అయిన ఎమినే బంటాయ్ గేల్‌తో కలిసి స్టెప్పులను అదరగొట్టాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గేల్ ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఈ నెల 1నే బాంటాయ్ రిలీజ్ చేశాడు. దీంతో ఈ వీడియోపై ఆసక్తి నెలకొన్నది. బాంటాయ్ తో కలిసి ఈ వీడియో చేయడం చాలా సంతోషంగా ఉందని గేల్ అన్నాడు.