అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు జాతి వివక్ష వివాదం కుదిపేస్తోంది. ఓ నల్ల జాతియుడు జార్జి ఫ్లాయిడ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, నడిరోడ్డుపై అతడిని చేతులు విరిచి నేలపై పడుకోబెట్టి గొంతుపై కాలు పెట్టి మరీ బంధించడం, ఆ తర్వాత అతడు మరణించిన నేపథ్యంలో అక్కడ నల్ల జాతియులు ఆగ్రహోదగ్రులయ్యారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు తెర తీశారు. ఈ ఆందోళనలు అమెరికాను దాటి ఇతర దేశాలకూ పాకుతున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో నల్ల జాతికి చెందిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ జాతి వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతి వివక్ష క్రికెట్ ను కూడా వదల్లేదని వ్యాఖ్యానించిన అతడు... తాను కూడా జాతి వివక్షను ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెరసి అమెరికాలో పేట్రేగిన జాతి వివక్ష వివాదానికి అతడు ఆజ్యం పోశాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అయినా జాతి వివక్షపై గేల్ ఏమన్నాడన్న విషయానికి వస్తే... ‘‘నల్ల జాతియుల ప్రాణాలు కూడా అందరిలాగే ప్రాణాలే కదా. నల్ల జాతియులను అవివేకులుగా పరిగణించే వారంతా జాత్యంహకారులే. నల్ల జాతియుల్లోని కొందరు ఇరుతల మాదిరే సొంత వర్గం వారిని వివక్షతో చూస్తున్నారు. వారంతా వారి వైఖరి మార్చుకోవాలి. నేను ప్రపంచాన్ని చుట్టేశాను. అదే సమయంలో స్వయంగా నేనే జాతి వివక్షను ఎదుర్కొన్నాను. ఎందుకంటే... నేనూ ఓ నల్ల జాతియుడినే కదా. జాతి వివక్ష ఫుట్ బాల్ కు మాత్రమే పరిమితం కాలేదు. అది క్రికెట్ లోనూ ఉంది. నల్ల జాతియులు నేతృత్వం వహించే జట్లలోనూ అది ఉంది. నల్ల జాతియుడిగా ఓ శక్తివంతమైన క్రీడాకారుడిగా ఉన్న నాకు... నల్ల జాతియుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంది’’ అంటూ గేల్ సంచలనాలకే సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు.
వెస్లిండిస్ క్రికెట్ లోనే కాకుండా వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న గేల్... తాను కూడా జాతి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పాడే గానీ... ఎప్పుడు, ఎక్కడ తాను దానిని ఫేస్ చేశాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే బిగ్ బ్యాష్ లీగ్ (బీబీఎల్)లో ఆడుతున్న సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ తో ప్రేమాయణం నడిపిన కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా గేల్ పై 10 వేల డాలర్ల మేర జరిమానాను విధించింది. ఈ జరిమానాపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. గేల్ పై ఈ మేర చర్యలు తీసుకోవాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన మినహా గేల్ జాతి వివక్షను ఎదుర్కొన్న దాఖలాలు పెద్దగా లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు అమెరికాలో రేగిన జాతి వివక్ష అల్లర్ల నేపథ్యంలో స్వయంగా గేల్ నోరు విప్పి మరీ జాతి వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.