రాజస్థాన్ జట్టు క్రిస్ మోరిస్‌ను రూ. 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే మోరిస్ కు అంత రేటా? అతడికి అంత సీన్ ఉందా? అని చాలా మంది అప్పట్లో కామెంట్లు చేశారు. విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు మోరిస్.
నిన్నటి మ్యాచ్ లో మోరిస్ చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అందులోనూ 4 సిక్సర్లు ఉండటం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరే చేసినప్పటికీ.. వాళ్ల బౌలింగ్, ఫీల్డింగ్ ఎంతో పటిష్ఠంగా ఉంటుంది. దీంతో రాజస్థాన్ గెలుస్తుందా? లేదా? అన్న అనుమానం నెలకొన్నది. అంతేకాక అంతుకు ముందు పంజాబ్ తో స్వల్ప తేడాతో విజయాన్ని చేజార్చుకున్న ఆర్ఆర్ జట్టు ఈ సారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందుకు మోరిస్ కూడా సాయపడ్డాడు. తన రేటుకు తగిన న్యాయం చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే అంతకు ముందు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 20వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ కొడితే రాజస్థాన్ గెలిచే స్థితిలో ఉంది. కానీ సంజూ సింగిల్ తీసి మోరిస్ కు అవకాశం ఇవ్వలేదు. చివరి బంతిని తానే ఆడటంతో జట్టు ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌లో మాత్రం మోరిస్ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. రబడా వేసిన 19 ఓవర్ లో రెండు సిక్స్‌లు కొట్టిన మోరిస్.. ఆపై టామ్ కరాన్ వేసిన ఆఖరి ఓవర్ లో కూడా రెండు సిక్స్‌లు సాధించి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్‌కు విజయాన్ని అందించాడు.
మోరిస్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇటు రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో ఆనందం, అటు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన. అప్పటివరకూ మిల్లర్ (62; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరవిహారంం చేసి ఢిల్లీకి వణుకు పుట్టిస్తే, ఆ తర్వాత మోరిస్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిల్లర్ ను పెవిలియన్‌కు పంపామన్న ఆనందం క్షణాల్లో ఆవిరయ్యేలా చేశాడు మోరిస్. ఇక తన కెప్టెన్ సంజూ శ్యాంసన్ కు కూడా పరోక్షంగా తన బ్యాటింగ్ ఇది అంటూ సంకేతాలు పంపాడు మోరిస్. విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.