పన్నెండేళ్ల బాలికలపై లైంగికవేధింపులకు పాల్పడిన వారికి కోర్టులు ఉరిశిక్ష విధించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన నాడే కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. చిన్నారులపై లైంగికదాడులకు వ్యతిరేకంగా ఒకవైపు దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతుండగా, కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడుల ఘటనలను అడ్డుకోలేమన్నారు. ఇంత పెద్ద దేశంలో లైంగిక దాడులు మామూ లే. ఏదో ఒక మూల ఒకటో - రెండో ఘటనలకు విపరీత ప్రచారంతో రాద్ధాంతం అవసరం లేదనుకుంటా. వాటి నిలుపుదలకు ప్రభుత్వం కృషి చేస్తున్నా జరుగుతుండటం దురదృష్టకరం అని అన్నారు. అవసర వ్యాఖ్యలు చేసి మీడియాకు మసాలా అందించొద్దని పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - నేతలను ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
నమో యాప్ ద్వారా బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మోడీ మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. ఆరు నెలలుగా ఉగ్రవాదం - లైంగికదాడులు - మహాభారత్ - డార్విన్ సిద్ధాంతం తదితర అంశాలపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదే రోజు మంత్రి నోరు జారారు. 'భారత్ లాంటి పెద్ద దేశంలో ఒకటి - రెండు లైంగికదాడి ఘటనలు చోటు చేసుకోవడం సహాజం. ఇంత మాత్రానికే ప్రజలు రాద్దాంతం చేయవలసిన అవసరం లేదు' అంటూ కేంద్ర కార్మిక, ఉపాది శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడులు దురదృష్టకరం అని, కొన్నిసార్లు వాటిని నియంత్రించకలేకపోతున్నాం అని అన్నారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదని అనంతరం కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
మరోవైపు ఇంకో బీజేపీ నేత సైతం ఇదే తరహా వివాదంలో చిక్కుకున్నారు. క్రైస్తవ మిషనరీల వల్ల భారతదేశం ప్రమాదంలో పడిందని బీజేపీ ఎంపీ భరత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మిషనరీలు దేశంలో ఖరీదైన పాఠశాలలను నిర్వహిస్తున్నాయని, వాటి ద్వారా ఆర్జించిన ధనాన్ని విదేశాలకు పంపిస్తున్నాయని ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై మిషనరీల ప్రభావం ఎక్కువగా ఉందని, మతమార్పిడులు అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా బలహీనం చేశారని ఆరోపించారు. బాలియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి భరత్ సింగ్ బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఆయన తల్లి సోనియాగాంధీ క్రైస్తవ మిషనరీల తరపున శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మిషనరీల కనుసన్నుల్లో నడుచుకుంటోందని విమర్శించారు. ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.హెచ్ లోయా మరణంపై జరుగుతున్న వివాదం నేపథ్యంలో భరత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో క్రైస్తవ మిషనరీల ఆదేశాల ప్రకారమే కాంగ్రెస్ - సోనియా - రాహుల్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ యావత్తు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.