భారతదేశంలో మతమార్పిడులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశంలో పెద్ద ఎత్తున మతం మారుతున్న వారి సంఖ్య పెరుగుతుంటే.... భాగవత్ మాత్రం దాన్ని తేలికగా కొట్టి పారేశారు. మతమార్పిడి ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు లేవని, మిషనరీలకు అంత బలం లేదని పేర్కొన్నారు. కులాలు - భాషలు - ప్రాంతాల భేదం లేకుండా హిందువులంతా ఏకం కావాలని కోరారు. గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లా వాంస్దాలో భారత్ సేవాశ్రమ్ సంఘ్ నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళన్ ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
గతంలో సామాన్య - మధ్య తరగతి ప్రజలపై దృష్టి సారించిన క్రైస్తవ సంస్థలు ఇప్పుడు ఆదివాసులను మారుస్తున్నాయని భాగవత్ విమర్శించారు. ఇలా ఇప్పటికే దాదాపు 30 శాతం వరకు క్రిస్టియన్లుగా మార్చేశారని ఆక్షేపించారు. "యూఎస్ - యూరప్ లలో ప్రజలను క్రైస్తవంలోకి మార్చిన తర్వాత (మిషనరీలు) ఇప్పుడు ఆసియా మీద కన్నేశాయి. సెక్యులర్ గా చెప్పుకొనే చైనా క్రైస్తవాన్ని అనుమతిస్తుందా?.. లేదు. మధ్య ప్రాచ్య దేశాలు అందుకు అంగీకరిస్తాయా?.. లేదు. దాంతో ఇప్పుడవి భారత్ వేదిక అని భావిస్తున్నాయి. కానీ 300 ఏళ్లకుపైగా ఎంతో ప్రయత్నించినప్పటికీ భారత జనాభాలో కేవలం ఆరు శాతాన్ని మాత్రమే క్రైస్తవంలోకి మార్చగలిగారు. వాళ్లకు అంత బలం లేదు" అని భాగవత్ విశ్లేషించారు. అమెరికాలో ఒక చర్చి - బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లో మరో చర్చిని వినాయక గుడులుగా - విశ్వ హిందూ పరిషత్ కార్యాలయాలుగా మారాయని చెప్పారు. వేలంలో అమెరికాలోని ఓ హిందూ వ్యాపారవేత్త చర్చిని కొనుగోలు చేశారని భాగవత్ వెల్లడించారు. హిందూ సమాజం జాగృతంగా ఉండాలని ఇతరులకు సేవ చేయడం ద్వారా హిందూ శక్తిని బలోపేతం చేసుకోవాలని భాగవత్ సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/