కాలం.. ఖర్మంతోపాటు.. చేసిన తప్పుడు పనుల పుణ్యమా అని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. గోవాలో తాజాగా చోటు చేసుకన్న ఉదంతం చూస్తే ఈ మాట ఎంత నిజమన్నది ఇట్టే అర్థమవుతుంది. గోవాకు చెందిన మాజీ మంత్రి చర్చిల్ అలెమావో లంచం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో భాగంగా ఏడు రోజులు లాకప్ లో గడిపిన ఆయనకు ఇటీవల జ్యూడిషియల్ రిమాండ్ కు పంపాలని న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆయన జైలుజీవితం గడుపుతున్న కోల్వాలే జైలుకు.. శంకుస్థాపన చేసింది ఆయనే.
2010లో మంత్రిగా ఉన్న ఆయన.. ఈ జైలుకు శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించారు. ఈ ఏడాది మే 30న ఈ జైలును ప్రారంభించారు. అలాంటి ఈ జైల్లో ప్రస్తుతం ఆయన ఖైదీగా ఉంటున్నారు. అంతేకాదు.. జైలు ప్రారంభం అయిన నాటి నుంచి జైలుకు వచ్చిన వీవీఐపీ ఖైదీ కూడా ఆయనేనంట. ఏ జైలుకు అయితే తాను శంకుస్థాపన చేశారో.. అదేజైలుకు నిందితుడిగా రావటం ఒక ఎత్తు అయితే.. జైల్లోని సౌకర్యాలు బాగానే ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేయటం విశేషం. మొత్తానికి తాను శంకుస్థాపన చేసిన జైలు నిర్మాణ పనులపై.. మాజీ మంత్రిగారుసర్టిఫికేట్ ఇచ్చేసినట్లే.