అమెరికా చెప్పింది..యుద్ధం వస్తే గెలుపు మనదే..

Update: 2016-09-30 08:57 GMT
ఇండోపాక్ సరిహద్దుల్లోని తాజా పరిణామాలను ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా అమెరికా దీనిపై ఓ కన్నేసి ఉంచింది. కొద్దికాలంగా పాక్ కు దూరమవుతూ భారత్ కు చేరువైన అమెరికా అప్పుడే ఈక్వేషన్లు వేసుకుంటోంది. భారత్ పాక్ ల మధ్య యుద్ధం వస్తే విజయం ఎవరిదన్న విషయంలో అమెరికా నిఘా వర్గాలు వాస్తవ అంచనాలు రూపొందించాయట. దాని ప్రకారం ఇండియాదే గెలుపని తేలింది. రెండు దేశాల సైనిక బలం... ఆయుధ బలం ఆధారంగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఇండియాదే గెలుపని తేల్చింది.

సీఐఏ లెక్కల ప్రకారం.. భారత్ వద్ద 13,25,000 మందితో కూడిన సైనిక బలగాలు ఉండగా పాకిస్థాన్ సైన్యం 6.20 లక్షలు మాత్రమే. భారత్ రిజర్వ్ సైన్యం 21.43లక్షలు కాగా పాకిస్థాన్‌ ది 5.15 లక్షలు. యుద్ధ విమానాలు భారత్ వద్ద 2,086 ఉండగా పాకిస్థాన్ వద్ద అవి 923 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్లు భారత్ వద్ద 646 ఉండగా పాక్ వద్ద కేవలం 306 మాత్రమే ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం మనకంటే పాకిస్థాన్ మరింత మెరుగ్గా ఉంది. ఇవి భారత్ వద్ద 19 మాత్రమే ఉండగా పాక్ వద్ద దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

అయితే... అటాక్ ఎయిర్ క్రాఫ్టుల విషయంలో మాత్రం పాక్ మనకంటే బాగా వెనుకబడిపోయింది. పాక్ వద్ద కేవలం 394 ఉండగా మన వద్ద 809 ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు భారత్ వద్ద 679 - పాక్ వద్ద 304 ఉన్నాయి. ట్రాన్స్‌ పోర్టు ఎయిర్‌ క్రాఫ్ట్‌ లు మనవద్ద 857 ఉండగా శత్రుదేశం వద్ద 261 ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయంలోనూ మనదే పైచేయి. మనవద్ద అవి 6,464 ఉండగా పాక్ వద్ద 2,924 మాత్రమే ఉన్నాయి. ఆర్మ్‌ డ్ ఫైటింగ్ వాహనాలు భారత్ వద్ద 6,704 - పాక్ వద్ద 2,828 ఉన్నాయి. విమాన వాహక నౌకలు మనవద్ద రెండు ఉండగా పాక్ వద్ద అసలు లేనే లేవు. మన వద్ద యుద్ధనౌకలు 295 ఉన్నాయి. పాక్ వద్ద 197 ఉన్నాయి. జలాంతర్గాములు భారత్ వద్ద 14 ఉండగా పాకిస్థాన్ వద్ద 5 మాత్రమే ఉన్నాయి. దీంతో ఏ రకంగా చూసినా ఇండియాదే పైచేయి అని.. యుద్ధమే కనుక వస్తే పాక్ ను ఇండియా రఫ్పాడేస్తుందని అమెరికా అంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News